ధనుష్ తో నట్టికుమార్..వై దిల్ కొలావరి?
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'త్రీ' (ట్యాగ్ లైన్) డబ్బింగ్ హక్కులను ఫాన్సీ రేటుకి ఎన్.కె. థియేటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నట్టి కుమార్ కొనుగోలు చేశారు. డబ్బింగ్ రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడగా, భారీ మొత్తాన్ని చెల్లించి ఆయన కొన్నారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ధనుష్ తండ్రి కస్తూరిరాజా తమిళంలో నిర్మించారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ 'నా మీద నమ్మకంతో డబ్బింగ్ హక్కుల్ని ఇచ్చిన నిర్మాత కస్తూరి రాజాగారికి, హీరో ధనుష్‌గారికి, దర్శకురాలు ఐశ్వర్యగారికి నా కృతజ్ఞతలు. ఈ నెల 20న తెలుగు, తమిళ చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో భారీగా ఆడియోను విడుదల చేస్తున్నాను.
ఈ కార్యక్రమ వేదికపై ధనుష్ ఎంతో పాపులర్ అయిన 'కొలవరి' పాటను పాడతారు. ఈ పాట తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. ధనుష్ అందించిన సాహిత్యం, అతని గాత్రం ఈ పాటకు బాగా సూటయ్యాయి. కొలవరి పాట సినిమా అంచనాలను పెంచింది. యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమా అవుతుంది. రజనీకాంత్‌గారి కుటుంబసభ్యులు సహా పలువురు తమిళ, తెలుగు చిత్రప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 30న విడుదల చేస్తున్నాం' అన్నారు.


Click it and Unblock the Notifications











