Court Collection Day 1: రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టిన ప్రియదర్శి.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే?

గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలిచిన చిత్రం కోర్ట్. ప్రియదర్శి హీరోగా , నేచురల్ స్టార్ నాని నిర్మాత కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మల్లేశం, బలగం తదితర చిత్రాలతో తన మార్క్ చూపించారు ప్రియదర్శి. సరైన బొమ్మ పడితే తనను ఎవరూ ఆపలేరని నిరూపించుకున్నారాయన. ఈ తరంలో తెలుగు నటుల్లో విలక్షణ నటనకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు ప్రియదర్శి. కామెడీతో పాటు సెంటిమెంట్‌తో ఏడిపించగలనని పలుమార్లు నిరూపించారు. మరి ప్రియదర్శి నటించిన కోర్ట్ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు. హోలీ కానుకగా మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Natural Star Nani Priyadarshi s Court Day 1 Box Office Collections Worldwide

తెలుగు చిత్ర పరిశ్రమలో కోర్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలు చాలా అరుదు. అలాంటిది డిఫరెంట్ సబ్జెక్ట్‌ పైగా నాని నిర్మాత కావడంతో కోర్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో డిస్కషన్ నడిచింది. అలాగే సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందుగానే పలు ఏరియాలలో పెయిడ్ ప్రీమియర్స్‌తో కోర్ట్ సినిమా సందడి చేసింది. అటు నిర్మాతగానూ నాని తనదైన ముద్ర వేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా నుంచి ఓ బొమ్మ బయటికి వస్తుందంటే దానిపై మంచి పాజిటివ్ అంచనాలే ఉంటున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కోర్ట్ సినిమాకు రూ.10 కోట్ల బడ్జెట్ అయ్యింది. అలాగే ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. నాని బ్రాండ్, ప్రియదర్శి గత చిత్రాల రికార్డ్స్ నేపథ్యంలో కోర్ట్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ వర్గాలు.

టీజర్, ట్రైలర్లకు తోడు ప్రీమియర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన కోర్ట్ మూవీ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిందో చూస్తే.. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి ఆక్యూపెన్సీ బాగుంది. మార్నింగ్ షోలకు 38.12 శాతం, మ్యాట్నీలకు 59.63 శాతం, ఫస్ట్ షోలకు 61.99 శాతం, సెకండ్ షోలకు 68.60 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హోలీ నాడు పూర్తిగా ఈ సినిమా ఆక్యూపై చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి రోజు ప్రియదర్శి కెరీర్‌లోనే అత్యధికంగా రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత అదిరిపోతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: priyadarshi court nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X