Court 10 days Collections: ప్రియదర్శి రేర్ ఫీట్.. 10 రోజుల్లో నాని మూవీకి ఎన్ని కోట్లంటే?

బలగం, మల్లేశం సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి పులికొండ మరోసారి వెండితెరపై మేజిక్ చేశాడు. పోక్సో చట్టం, భారత న్యాయవ్యవస్థ చుట్టూ తిరిగే కథతో రూపొందిన కోర్ట్ సినిమాలో లాయర్‌గా తన నట విశ్వరూపం ప్రదర్శించారు. విడుదలై దాదాపు 10 రోజులు కావొస్తున్నా ఈ సినిమా నేటికీ రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. పరీక్షలు, ఐపీఎల్ వంటి అన్ సీజన్‌లోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో 10 రోజుల్లో కోర్ట్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్ అయ్యింది. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ బుల్గానియన్ స్వరాలు సమకూర్చారు. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది.

Natural Star Nani Priyadarshi s Court Day 10 Box Office Collections Worldwide

నాని బ్యానర్‌కు ఉన్న ఇమేజ్, ప్రియదర్శి గత చిత్రాల రికార్డుల నేపథ్యంలో కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ కింద ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలలో దాదాపు రూ.10 కోట్ల వ్యాపారం జరగ్గా.. డిజిటల్ రైట్స్ రూ.8 కోట్లు, ఆడియో హక్కుల కింద రూ. 30 లక్షలకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రియదర్శి - నానిల చిత్రం లాభాల బాట పట్టాలంటే రూ.22 కోట్ల గ్రాస్.. 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న కోర్ట్ చిత్రం పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. తొలిరోజు రికార్డు స్థాయిలో రూ.7 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా తొలివారంలోనే దాదాపు రూ.35 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినిష్ చేసిన కోర్ట్ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. అన్ సీజన్‌లోనూ రోజుకు రూ.2 కోట్లు తగ్గకుండా గ్రాస్ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. నిర్మాత నానికి, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక 10వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. ఆదివారం కోర్ట్ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.3.60 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. అంతేకాదు ఆదివారం వసూళ్లతో కలిపి మొత్తం 10 రోజులకు గాను రూ.50 కోట్ల కలెక్షన్స్‌తో చరిత్ర సృష్టించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇండియా వైడ్‌గా నికరంగా రూ.40 కోట్లు, ఓవర్సీస్‌లో నికరంగా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కోర్ట్. మరి రెండో వారంలో ప్రియదర్శి ఎలాంటి దూకుడు చూపిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: nani priyadarshi court
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X