Court 13 days Collections: వసూళ్లలో ప్రియదర్శి మరో రేర్ ఫీట్ .. కోర్ట్ మూవీకి ఎన్ని కోట్లు అంటే?

విలక్షణ నటుడు ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ కోర్ట్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న చిత్రంగా వచ్చిన కోర్ట్ ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. పరీక్షల సీజన్, ఐపీఎల్ వంటి అన్‌ సీజన్‌లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 13వ రోజు ప్రియదర్శి సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? ఇంకెన్ని రికార్డులు నెలకొల్పిందో చూస్తే :

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్ అయ్యింది. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానియన్ సంగీతం అందజేశారు. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.

Natural Star Nani Priyadarshi s Court Day 13 Box Office Collections Worldwide

కోర్ట్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ.22 కోట్ల గ్రాస్.. 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ టార్గెట్‌ను ఊదేశాడు ప్రియదర్శి . ఆ తర్వాత చూస్తుండగానే తొలి వారంలో రూ.35 కోట్లు అందుకున్న కోర్ట్ సినిమా రోజుకు కోటిన్నర తగ్గకుండా వసూళ్లు రాబడుతున్నారు. ఇక 10వ రోజు వసూళ్లతో కలిపి కోర్ట్ చిట్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

నానికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కోర్ట్ సినిమాకు బాగా కలిసొచ్చింది. నాని తెరకెక్కించిన సినిమాలు వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరాయి. ఇప్పుడు కోర్ట్ కూడా ఈ లిస్ట్‌లోకి చేరి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కోర్ట్ సినిమా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్లు వాల్ పోస్టర్ సినిమా ప్రకటించింది. తెలుగు సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయం మార్చుకునే విషయంలో కోర్ట్ కొత్త నిర్వచనం ఇచ్చిందని నాని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకెంతో గర్వంగా ఉందన్నారు.

ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్ అనేది చాలా మంది హీరోలు ఈ ఫీట్ కొట్టలేకపోయారు. పలువురు హీరోలకు ఇది అందని ద్రాక్షగా ఉండగా.. దానిని ప్రియదర్శి తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం లో బడ్జెట్‌లో కథ, కథనాలను నమ్ముకుని నాని చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇక కోర్ట్ సినిమా 13వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

పరీక్షల సీజన్‌లోనూ డబుల్ డిజిట్ ఆక్యూపెన్సీని నమోదు చేసింది కోర్ట్. మార్నింగ్ షోలకు 13.01 శాతం, మ్యాట్నీ షోలకు 13.98 శాతం, ఫస్ట్ షోలకు 12.10 శాతం, సెకండ్ షోలకు 12.06 శాతం చొప్పున ఆక్యూపెన్సీ అందుకున్నట్లు సాక్‌నిక్.కామ్ తెలిపింది. ఈ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం 13వ రోజు కోర్ట్ చిత్రం రూ.88 లక్షల గ్రాస్ అందుకోగా, ఆఫ్ లైన్ బుకింగ్స్‌తో కలిసి వసూళ్లు కోటి దాటి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎదురులేకుండా సాగిపోయిన కోర్ట్ చిత్రానికి మార్చి 27న రిలీజయ్యే సినిమాల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ప్రియదర్శి ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Read more about: nani priyadarshi court
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X