Court Day 3 Collection: 3 రోజుల్లో 20 కోట్లతో సంచలనం .. బాదిపడేస్తోన్న ప్రియదర్శి, నానికి లాభాల పంట!

కమెడియన్‌గా, విలక్షణ నటుడిగా రాణిస్తున్న ప్రియదర్శి లీడ్ రోల్‌లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఏ నోబడి . హోలీ పర్వదినం సందర్భంగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండ్రోజుల్లో ఏకంగా రూ.9 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది. మరి మూడో రోజైన ఆదివారం ఈ కోర్ట్ డ్రామా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో ట్రేడ్ పండితుల అంచనాను పరిశీలిస్తే :

కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను దాదాపు రూ. 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

Natural Star Nani Priyadarshi s Court Day 3 Box Office Expected Collections Worldwide

ప్రియదర్శి గత సినిమాలు బలగం, మల్లేశం, జాతిరత్నాలతో ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక నాని ప్రొడ్యూసర్ కావడంతో ఆయన బ్యానర్‌పై ఉన్న ఇంపాక్ట్ దృష్ట్యా కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని విలువ కట్టారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 థియేటర్‌లలో విడుదలైన కోర్ట్ చిత్రం పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.8.10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మరో రూ.7.80 కోట్లు వసూళ్లు చేసి.. మొత్తంగా రూ.15.90 కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌ను ఛేదించినట్లు నిర్మాతలు తెలిపారు.

అటు టికెట్ బుకింగ్స్‌లోనూ ప్రియదర్శి చిత్రం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మూడో రోజు సాయంత్రం వరకు కోర్ట్ సినిమాకు 300కే (3 లక్షలు) టికెట్లు బుక్ అయినట్లు ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో ప్రకటించింది. అలాగే ఈ కోర్ట్ డ్రామాకు 9.6 పబ్లిక్ రేటింగ్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రియదర్శి సినిమా ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్ల వద్ద ముగిస్తాడా అని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కోర్ట్ సినిమాకు ఆదివారం ఉదయం షోలకు 39.29 శాతం, మ్యాట్నీ షోలకు 65.40 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. రేపు పరీక్షలు ఉండటంతో సెకండ్ షో బుకింగ్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మూడో రోజు కోర్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి నాని నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఏ మేర అంచనాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: priyadarshi court nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X