Court Box Office: ప్రియదర్శి జోరుకు బ్రేకులు.. షాకిచ్చేలా కోర్ట్ వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
కంటెంట్ ఉంటే సినిమా పెద్దదా? చిన్నదా? అన్న తేడా లేకుండా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన చిత్రాలు టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. కోవిడ్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు . బలగం, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది కోర్ట్. ప్రియదర్శి హీరోగా, నాని నిర్మాణంలో వచ్చిన ఈ కోర్ట్ డ్రామా సంచలన విజయం సాధించింది. విడుదలైన నాలుగో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

నాని ప్రొడ్యూసర్ కావడంతో పాటు ప్రియదర్శి వరుస విజయాలతో ఊపులో ఉన్నారు. టీజర్, ట్రైలర్‌లకు తోడు ప్రమోషన్ కార్యక్రమాలతో కోర్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. కోర్ట్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని నిర్దేశించారు.
ఫస్ట్ వీకెండ్‌లో ఏకంగా రూ.24.4 కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది కోర్ట్ సినిమా. తొలి వారాంతంలో మేజిక్ చేసిన ప్రియదర్శికి సోమవారం నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు తోడు, సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో నాలుగో రోజు కలెక్షన్స్ బాగా పడిపోయాయి. తొలి మూడు రోజులతో పోలిస్తే కోర్ట్‌కు బుకింగ్స్ తగ్గిపోయాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రియదర్శి చిత్రం రూ.3.25 కోట్ల వసూళ్లు సాధించింది. దీనితో కలిపి ఇప్పటి వరకు ఈ కోర్ట్ డ్రామా రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇందులో ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 16 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
2025లో విడుదలైన తెలుగు సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో కోర్ట్ 5వ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (రూ.90 కోట్లు), డాకు మహారాజ్ (రూ.50 కోట్లు), సంక్రాంతికి వస్తున్నాం (రూ.44 కోట్లు) , తండేల్ (రూ.20.5 కోట్లు) ముందున్నాయి. మరి ఈ వర్కింగ్ డేస్‌లో, పరీక్షల సీజన్‌లో ప్రియదర్శి చిత్రం ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. వీకెండ్ కాబట్టి దుమ్మురేపిన ఈ సినిమా.. మరి వీక్ డేస్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











