Court Day 4 Collection: పడిపోయిన బుకింగ్స్ .. ప్రియదర్శికి మూవీకి షాకిచ్చేలా వసూళ్లు , ఎన్ని కోట్లంటే?

రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్ పోషించిన చిత్రం కోర్ట్ . పోక్సో చట్టంపై అవగాహనతో పాటు సున్నితమైన ప్రేమకథగా వచ్చిన ఈ కోర్ట్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.24 కోట్లకు పైగా వసూళ్లతో లాభాల్లోకి వచ్చేసిన ఈ చిన్న సినిమా విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారని కోర్ట్ చిత్రం నిరూపించింది. ఈ నేపథ్యంలో 4వ రోజు ప్రియదర్శి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించారు. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రియదర్శి గత సినిమాల రికార్డులు, నాని బ్రాండ్ నేమ్ కారణంగా కోర్ట్ సినిమాపై సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Natural Star Nani Priyadarshi s Court Day 4 Box Office Expected Collections Worldwide

టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా కోర్ట్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని విలువ కట్టారు. హోలీ కానుకగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కోర్ట్ మూవీ పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది.

తొలిరోజు రూ.8.10 కోట్ల ఓపెనింగ్స్‌తో దుమ్మురేపిన కోర్ట్ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఛేదించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే రూ.24 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంతో కోర్ట్ సినిమా లాంగ్ రన్‌లో ఎన్ని కోట్లు రాబడుతుంది? ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక నాలుగో రోజుల ప్రియదర్శి సినిమా ఎంత రాబడుతుందనే దానిపై ట్రేడ్ పండితులు రకరకాల అంచనాలు వేస్తున్నారు.

కొత్త సినిమాలకు తోడు, తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు, వర్కింగ్ డేస్ కారణంగా నాలుగో రోజైన సోమవారం కోర్ట్ సినిమాకు బుకింగ్స్ డల్‌గానే ప్రారంభమయ్యాయి. ఉదయం ఆటలకు 21.85 శాతం, మ్యాట్నీ షోలకు 31.18 శాతం ఆక్యూపెన్సీ నమోదవ్వగా ఫస్ట్ షో, సెకండ్ షోలను బట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. కోర్ట్ చిత్రం నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సవాళ్లను దాటుకుని ప్రియదర్శి ఎంత మేర కలెక్షన్స్ అందుకుంటాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: nani priyadarshi court
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X