Court Day 5 Collection: నానికి షాక్.. పడిపోతున్న వసూళ్లు, ప్రియదర్శి మూవీకి ఎన్ని కోట్లంటే?
కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటించిన కోర్ట్ చిత్రం అంచనాలు మించి రాణిస్తోంది. న్యాయ శాస్త్రం, సామాజిక అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామాకు అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఫీల్ గుడ్ కంటెంట్, ప్రియదర్శి నట విశ్వరూపం , నటీనటుల ప్రతిభ ఈ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లడంతో పాటు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన కోర్ట్ చిత్రం, లాభాల పంట పండిస్తోంది. మరి 5వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించారు. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానియన్ స్వరాలు సమకూర్చారు. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది.

టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా కోర్ట్ సినిమాపై ప్రజల్లో మంచి డిస్కషన్ నడిచింది. దానికి ముందు పలు నగరాల్లో చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ కావడం కూడా కలిసొచ్చింది. వీటి కారణంగా నాని సినిమాకు సాలీడ్‌గానే ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.
రూ.11 కోట్ల షేర్.. రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లే టార్గెట్‌గా బాక్సాఫీస్ బరిలో నిలిచిన కోర్ట్ చిత్రం మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.4 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే వీకెండ్‌లో దుమ్మురేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ వరకు వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయింది. పరీక్షల సీజన్ ప్రభావంతో బుకింగ్స్ పడిపోతున్నాయి. తొలి మూడు రోజుల్లో నమోదైన స్థాయిలో ఆక్యూపెన్సీ రావడం లేదు.
మూడో రోజైన ఆదివారం రూ.6 కోట్లు రాబట్టిన కోర్ట్ సినిమా.. నాలుగో రోజు సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్లకే పరిమితమైంది. నాలుగో రోజు ఈ చిత్రం దాదాపు 50.4 శాతం బుకింగ్స్ కోల్పోయింది. ఇక ఐదో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. మంగళవారం ఉదయం మందకొడిగా ఉన్న బుకింగ్స సాయంత్రానికి పుంజుకున్నాయి. ఫస్ట్ షోకి 23.89 శాతం, నైట్ షోస్‌కి 33.73 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది.
మంగళవారం హైదరాబాద్‌లో 428, బెంగళూరులో 239, విశాఖలో 109, విజయవాడలో 109 షోలు పడ్డాయి. మొత్తంగా ఐదో రోజు ఆడియన్స్‌ని మరోసారి నిరాశపరుస్తూ రూ.2.75 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల వరకు ప్రియదర్శి సినిమా రూ.33.75 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరి తొలి వారం ముగిసేసరికి కోర్ట్ చిత్రం ఎన్ని కోట్లు సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











