Court Day 7 Collection: బాక్సాఫీస్ బెండ్ తీస్తోన్న ప్రియదర్శి.. కోర్ట్ చిత్రానికి ఎన్ని కోట్లంటే?
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కోర్ట్. న్యాయశాస్త్రం, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ సామాన్యులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కోర్ట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణ విలువలకు, ప్రియదర్శి నట విశ్వరూపానికి ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. గడిచిన 6 రోజుల్లో రూ. 37 కోట్ల వసూళ్లతో దుమ్మురేపుతోంది. మన దగ్గర కోర్ట్ డ్రామా ఉన్న చిత్రాలు ఆడటం చాలా అరుదు. కానీ ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏడో రోజు ప్రియదర్శి చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించారు. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానియన్ సంగీత సారథ్యం వహించారు. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది.

నాని బ్రాండ్ ఇమేజ్, ప్రియదర్శి గత చిత్రాల రిజల్ట్ నేపథ్యంలో కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ కింద ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలలో దాదాపు రూ.10 కోట్ల బిజినెస్ జరగ్గా.. డిజిటల్ రైట్స్ రూ.8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 30 లక్షలకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.22 కోట్ల గ్రాస్.. 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
22 కోట్ల గ్రాస్.. 11 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ వద్ద పరుగు ప్రారంభించిన కోర్ట్ సినిమా ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది. తొలి రోజు రూ.4.15 కోట్లు, రెండో రోజు రూ.5 కోట్లు, మూడో రోజు ఏకంగా 5.65 కోట్లు, నాలుగో రోజు రూ. 2.60 కోట్లు, ఆరో రోజు రూ.2.4 కోట్ల వసూళ్లు రాబట్టి ఆరు రోజుల వరకు దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఐదో స్థానంలో నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్, తండేల్ చిత్రాలు ప్రియదర్శి సినిమా కంటే ముందున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కోర్ట్ చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వీరికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇక ఏడో రోజు కోర్ట్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూస్తే. ఏడో రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీనితో కలిపి మొత్తంగా తొలి వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసేసరికి ఈ సినిమా రూ.39.60 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో ప్రియదర్శి సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందోనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందో.


Click it and Unblock the Notifications











