Saripodhaa Sanivaaram day 2 Collections: వసూళ్ల వేటలో సరిపోదా శనివారం.. నాని మూవీ రికార్డు కలెక్షన్స్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన మూవీ సరిపోదా శనివారం. గురువారం వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించగా.. నాని సరసన ప్రియాంక మోహన్ ఆడిపాడారు. మురళీ శర్మ, అజయ్ ఘోష్, సాయికుమార్ తదితరులు కీలకపాత్ర పోషించిన ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 100 కోట్ల మేర నిర్మాణ వ్యయం అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమాకు సంబంధించి నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా నాని సినిమా రూ.41 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్.

దీని బట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లన్న మాట. మరి నాని ఈ టార్గెట్‌ను ఎలా కొడతాడా అనేది ట్రేడ్ వర్గాలను సైతం అటెన్షన్‌లో ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్, ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో సరిపోదా శనివారం మూవీని దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో భారీ ఒపెనింగ్స్ సాధించింది. తమిళంలో ఈ చిత్రం తొలి రోజున 50 లక్షల గ్రాస్ వసూళ్లను, కన్నడలో 1 కోటి రూపాయలు.. మలయాళం, హిందీ భాషల్లో కలిపి సుమారుగా 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని అంటున్నారు. మొత్తంగా ఇండియా వైడ్ నాని చిత్రం రూ.9 కోట్ల నికర వసూళ్లను రాబట్టిందని అంచనా.
సరిపోదా శనివారం సినిమా ఏపీ, తెలంగాణలో తొలి రోజు 14 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 2.25 కోట్ల గ్రాస్ కలిపి ఇండియా వైడ్ రూ. 16.25 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. అలాగే ఓవర్సీస్‌లో రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా నాని చిత్రం తొలి రోజున సుమారుగా 23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి నేచురల్ స్టార్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచింది.

ఈ సినిమా నార్త్ అమెరికాలో 850K డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించి వేగంగా 1 మిలియన్ దిశగా దూసుకెళ్లోంది. తద్వారా ఓవర్సీస్‌లో తనకు తిరుగులేదని నాని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అయితే రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే కావడంతో మ్యాట్నీ వరకు బాక్సాఫీస్ డల్‌గా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవినింగ్ నుంచి వీకెండ్ మొదలవుతూ ఉండటం, మరే కొత్త సినిమా లేకపోవడంతో సరిపోదా శనివారానికి ఆక్యూపెన్సీ పెరుగుతుందని అంటున్నారు.
రెండో రోజు నాని సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని , ఇతర రాష్ట్రాల్లో రూ.3.5 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు అందుకుని ఇండియా వైడ్‌గా రూ.10 కోట్ల నుంచి రూ. 11.5 కోట్ల మధ్య గ్రాస్ అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవర్సీస్‌లో మాత్రం నాని తన ప్రభంజనం చూపిస్తున్నాడు.ఈ వీకెండ్‌లోగా 1 మిలియన్ దాటి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











