saripodhaa sanivaaram collections: షాకింగ్‌గా సరిపోదా శనివారం కలెక్షన్స్.. నాని మూవీకి ఎన్ని కొట్లంటే?

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన మూవీ సరిపోదా శనివారం. గురువారం వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌జే సూర్య విలన్‌ రోల్ పోషిస్తుండగా.. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. దసరా, హాయ్ నాన్న సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావడంతో ఈ మూవీ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. అంటే రూ.42 వేల కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ అన్న మాట. మరి నాని ఈ టార్గెట్‌ను ఎలా కొడతాడా అనేది ట్రేడ్ వర్గాలను సైతం అటెన్షన్‌లో ఉంచింది. ఓవర్సీస్‌లో ప్రత్యేకించి అమెరికన్ మార్కెట్‌లో నాని సినిమాలు బాగానే గిట్టుబాటవుతాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో సరిపోదా శనివారం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్ కోసం 17 వేల టికెట్లు బుక్ అయినట్లుగా టాక్.

natural star nani s saripodhaa sanivaaram Day 1 expected Collections here s the details

అమెరికాలోని 415 లోకేషన్స్‌లో ప్రీమియర్స్ పడగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఈ సినిమాకు 3,12,356 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.2 కోట్ల 62 లక్షల 26 వేల 284) వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనిని బట్టి నాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సరిపోదా శనివారం ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎలా రాబట్టిందనే దానిపై సోషల్ మీడియాలో కొన్ని గణాంకాలు వైరల్ అవుతున్నాయి.

సరిపోదా శనివారానికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు మార్నింగ్ షోకు 45.77 శాతం ఆక్యూపెన్సీ లభించిందని ఫిలింనగర్ టాక్. హైదరాబాద్‌లో 56 శాతం ఆక్యూపెన్సీతో 557 షోలు, బెంగళూరులో 26 శాతం ఆక్యూపెన్సీతో 369 షోలు పడ్డాయి. తమిళ్ వెర్షన్ వచ్చే సరికి చెన్నైలో 92 షోలు, మధురైలో 56 మార్నింగ్ షోలు పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

natural star nani s saripodhaa sanivaaram Day 1 expected Collections here s the details

అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షో కలెక్షన్స్ పరంగా చూస్తే సరిపోదా శనివారం నాని రేంజ్‌ను పెంచేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ట్రెండ్‌ను బట్టి చూస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6 నుంచి రూ.7 కోట్ల మధ్యలో షేర్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ బాగుండి.. ఫస్ట్ షో, సెకండ్ షోలకి బుకింగ్స్ పెరిగితే వసూళ్లు అదిరపోతాయని అంటున్నారు. ఈ లెక్కన సరిపోదా శనివారం రూ.8 నుంచి రూ.9 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్ షేర్‌ను రాబట్టవచ్చని అంచనా.

అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఐనాక్స్ పీవీఆర్ సంస్థల మధ్య విభేదాలు సహా అన్ని రకాల అవాంతరాలను దాటుకుని సరిపోదా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ తిరుగులేదని నిరూపించుకుంది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ నాని బ్రాండ్ వాల్యూతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపింది. అంతేకాదు.. టైర్-2 రిలీజ్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరిపోదా శనివారం నిలిచింది. గంట గంటకు బుకింగ్స్‌లో ప్రభంజనం సృష్టిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు నాని. మరి నేచురల్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Read more about: nani priyanka mohan vivek athreya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X