Saripodhaa Sanivaaram day 3 Collections: సరిపోదా శనివారానికి రెయిన్ ఎఫెక్ట్ .. అయినా తగ్గేదే లేదంటోన్న నాని
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన మూవీ సరిపోదా శనివారం. ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించగా.. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. తొలి రెండు రోజుల్లోనే 40 శాతం రికవరీని సొంతం చేసుకున్న నాని.. ఆ మొత్తాన్ని ఈ వీకెండ్‌లోగా దక్కించుకోవాలని వడివడిగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సరిపోదా శనివారం మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో పరిశీలిస్తే..
ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులతో కలిపి సరిపోదా శనివారానికి రూ. 100 కోట్ల మేర ఖర్చు అయినట్లుగా ఫిలింనగర్ టాక్. దసరా, హాయ్ నాని వంటి సినిమాల తర్వాత నాని నటించిన మూవీ కావడంతో సరిపోదా శనివారానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా నాని సినిమా రూ.41 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. దీని బట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లన్న మాట. ఒకరకంగా ఇది నేచురల్ స్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.

సరిపోదా శనివారం మూవీని దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా... ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో భారీ ఒపెనింగ్స్ సాధించింది. ఏపీ, తెలంగాణలో తొలి రోజు 14 కోట్ల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 2.25 కోట్ల గ్రాస్ కలిపి ఇండియా వైడ్ రూ. 16.25 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. అలాగే ఓవర్సీస్‌లో రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా నాని చిత్రం ఫస్ట్ డే రూ. 23 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
ఇక రెండో రోజు విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, ఆంధ్ర కలిపి నికరంగా రూ.6 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళంలో రూ.75 లక్షల గ్రాస్, మలయాళంలో రూ.50 లక్షల గ్రాస్, కన్నడలో రూ.1.25 లక్షల గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా ఇండియా వైడ్ రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో కేవలం రెండు రోజుల్లోనే నాని సినిమా 1 మిలియన్ క్లబ్‌లో చేరింది. మొత్తంగా సరిపోదా శనివారం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.34 కోట్ల వసూళ్లను రాబట్టింది.

వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు సరిపోదా శనివారానికి టికెట్లు బాగానే తెగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తెలుగునాట శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. బిజినెస్ సెంటర్‌లైన కీలక నగరాలు, పట్టణాల్లో కుంభవృష్టి కురుస్తోంది. అయినప్పటికీ సరిపోదా శనివారానికి బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ మూడో రోజున వరల్డ్ వైడ్‌గా అన్ని భాషల్లో కలిపి రూ.8 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందని అంచనా. ఓవర్సీస్‌లో మాత్రం నాని దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే 1 మిలియన్‌ని క్రాస్ చేసిన సరిపోదా శనివారం దానిని డబుల్ డిజిట్‌గా మార్చాలని ట్రై చేస్తోంది. మరి నాని సినిమా మూడో రోజు ఎంత మేర వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











