Miss Shetty Mr Polishetty Collections:12రోజుల్లోనే అన్ని కోట్లా..వామ్మో మిస్టర్ శెట్టి బాగానే వసూలు చేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ చిత్రానికి మహేశ్ బాబు పీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 12 రోజుల రిపోర్టును ఓసారి ఈ స్టోరీలో చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 12 రోజుల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే..... తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.35 కోట్లు, రెండో రోజురూ.1.21 కోట్లు, 3వ రోజు రూ.2.08కోట్లు, 4వ రోజు రూ.2.44 కోట్లు, 5వ రోజు రూ.1.08 కోట్లు, 6వ రోజు రూ.74 లక్షలు, 7వ రోజు రూ.60లక్షలు, 8వ రోజు రూ.44 లక్షలు, 9రోజు రూ.40లక్షలు, 10వ రోజు రూ. 69 లక్షలు 11వ రోజు రూ.62లక్షలు, 12వ రోజు 53లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.12.18 షేర్ (రూ21.55 గ్రాస్) రాబట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వివరాలకు వస్తే... నైజాం రూ. 26లక్షలు, సీడెడ్ రూ.4.49లక్షలు, ఆంధ్రా రూ.22 లక్షలు రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.0.53 కోట్లు షేర్ (రూ.1.00 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాం రూ6.58 కోట్లు, సీడెడ్ రూ.1.11 కోట్లు, ఆంధ్రా రూ.4.49 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.12.18 కోట్ల షేర్(రూ.21.55కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.65 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో రూ. 7.50కోట్లు వసూలు చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ21.33 కోట్ల షేర్(41.20కోట్ల ~ గ్రాస్) వసూలు చేసింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదటిరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 3.00కోట్ల షేర్ (రూ.5.95 కోట్ల గ్రాస్), 2వ రోజు కలెక్షన్లు రూ.2.26 కోట్ల షేర్ (రూ.4.55కోట్ల~ గ్రాస్), 3వ రోజు కలెక్షన్లు రూ.3.58కోట్ల షేర్ (రూ.6.70కోట్ల~ గ్రాస్), 4వ రోజు కలెక్షన్లు రూ.4.36 కోట్ల షేర్ (రూ.8.45కోట్ల~ గ్రాస్), 5వ రోజు రూ.1.48కోట్లు షేర్ (రూ.2.80కోట్లు~ గ్రాస్), 6వ రోజురూ.1.21కోట్లు షేర్ (రూ.2.35కోట్లు గ్రాస్),7వ రోజురూ. 0.86కోట్లు షేర్ (రూ.1.65కోట్లు~ గ్రాస్), 8వ రోజు రూ.0.64కోట్లు షేర్ (రూ.1.20కోట్లు~ గ్రాస్), 9వ రోజు రూ. 0.77కోట్ల షేర్ (రూ.1.45కోట్లు గ్రాస్), 10వ రోజు రూ.1.22కోట్ల షేర్ (రూ.2.30కోట్లు~ గ్రాస్), 11వ రోజు రూ.0.90కోట్లు షేర్ (రూ.1.75కోట్ల~ గ్రాస్) , 12వ రోజు కలెక్షన్లు రూ.1.05కోట్ల షేర్ (రూ.2.05రూ.గ్రాస్) వసూలు చేసింది.

సినిమా మొత్తం వ్యాపారం(విలువ) రూ.12.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ రూ. 13.50కోట్లుగా నమోదు అయింది. సినిమా మొత్తం లాభం రూ.7.83కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.


Click it and Unblock the Notifications











