Miss Shetty Mr Polishetty Collections: మొదటి రోజే ఊహించని వసూళ్లు.. మొత్తంగా ఎన్ని కోట్లు అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన టాలెంట్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఆరంభం నుంచే విభిన్నమైన పంథాను ఫాలో అవుతోన్న అతడు.. క్రేజీ కంటెంట్ మూవీలతో వస్తున్నాడు. ఇలా 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అతడు నటించిన చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం గురువారమే విడుదలైంది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్ లభించింది. మరి ఆలస్యం చేయకుండా.. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి!
క్రేజీగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి:నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రలు చేశారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 5 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో రిలీజ్ అయింది.

అలాంటి టాక్.. రెస్పాన్స్ ఫుల్:క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మొదటి రోజు అనుకున్న రీతిలోనే కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

మొదటి తెలుగు రాష్ట్రాల్లో ఇలా:నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కలిసి చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమాకు వసూళ్లు అనుకున్న విధంగానే లభించాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా రూ. 1.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 1.40 కోట్లు షేర్ రాబట్టిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో 300K డాలర్లు అంటే రూ. 1.20 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.90 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 2.90 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 2.60 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











