Anaganaga Oka Raju Business: అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ బిజినెస్.. పొలిశెట్టి మూవీ బ్రేక్ఈవెన్ ఎన్ని కోట్లంటే?

Anaganaga Oka Raju Business: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఈ సంక్రాంతికి ' అనగనగా ఒక రాజు '(Anaganaga Oka Raju) అనే సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) నటించారు. సాధారణంగా క్లీన్ ఎంటర్టైన్మెంట్, స్ట్రాంగ్ కంటెంట్, కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఈ మూవీ జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ ట్రేడ్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ సినిమాకు మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు.

Naveen Polishetty s Anaganaga Oka Raju Business Budget Pre-Release Business Break Even Target

టాలీవుడ్‌లో విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసిన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఒకటిగా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.28 కోట్లకు చేరింది. ఇది నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో హైయెస్ట్ ప్రీ-బిజినెస్‌లలో ఒకటిగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నైజాంలో రూ.7 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్ల డీల్స్ జరిగినట్టు తెలుస్తోంది.

ఇలా భారీ థియేట్రికల్ బిజినెస్‌తో పాటు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా కూడా ఈ సినిమా భారీ ఆదాయాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా సుమారు రూ.27 కోట్లు, ఓవర్సీస్ హక్కుల ద్వారా మరో రూ.5 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ టాక్. దీంతో విడుదలకు ముందే మొత్తం బిజినెస్ రూ.50 కోట్లకు పైగా జరిగినట్టు తెలుస్తోంది.

ఇలా విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లోకి వెళ్లడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో బ్రేక్ ఈవెన్ లెక్కలపై చర్చ సాగుతోంది. థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన మొత్తం తిరిగి రావాలంటే సినిమా రూ. 28 కోట్ల షేర్ సాధించాలి. అంటే.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 55- 60 కోట్ల గ్రాస్ కలెక్షన్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ స్థాయి బిజినెస్ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్, నవీన్ పొలిశెట్టి మార్కెట్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అన్ని కలిసి సినిమాకు ప్లస్‌గా మారనున్నాయి. మొత్తానికి విడుదలకు ముందే అన్ని విధాలుగా సేఫ్ జోన్‌లోకి వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో, నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X