APలో రామ్ చరణ్ ‘నాయక్’ ఆల్ టైం రికార్డ్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో వారం రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ స్టామినా చూపుతోంది. తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. ఏపీలో తొలి వారంలో రూ. 26.39 కోట్ల షేర్ సాధించడంతో, రెస్టాఫ్ ఇండియాతో కలుపుకుని రూ. 30.49 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పించింది.
ఏరియా వారిగా ఫస్ట్ వీక్ షేక్ డిటేల్స్
నైజాం -8.57 కోట్లు
సీడెడ్ -5.57 కోట్లు
నెల్లూరు -1.31 కోట్లు
గుంటూరు -2.93 కోట్లు
కృష్ణ -1.47 కోట్లు
వెస్ట్ గోదావరి -2.00 కోట్లు
ఈస్ట్ గోదావరి -1.90 కోట్లు
ఉత్తరాంధ్ర -2.64 కోట్లు
మొత్తం ఏపీ షేర్ -26.39 కోట్లు
కర్నాటక -2.83 కోట్లు
రెస్టాఫ్ ఇండియా -1.27 కోట్లు
టోటల్ ఇండియా షేర్ -30.49 కోట్లు
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











