twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నాయక్’ రెండో వారం షేర్ (ఆల్ టైం రికార్డ్!)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ స్టామినా చూపుతోంది. ఫస్ట్ వీక్ ఏపీ కలెక్షన్ల విషయంలో ఆల్ టైం రికార్డ్ నెలకొల్పిన ఈ చిత్రం రెండో వారంలోనూ తన సత్తా చాటింది. ఏపీలో రెండు వారాల్లో రూ. 36.87 కోట్ల షేర్ సాధించడంతో, రెస్టాఫ్ ఇండియాతో కలుపుకుని రూ. 42.03 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పించింది.

    ఏరియా వారిగా రెండో వారం షేర్ డిటేల్స్

    నైజాం -11.60 కోట్లు
    సీడెడ్ -7.66 కోట్లు
    నెల్లూరు -1.81 కోట్లు
    గుంటూరు -3.92 కోట్లు
    కృష్ణ -2.06 కోట్లు
    వెస్ట్ గోదావరి -2.83 కోట్లు
    ఈస్ట్ గోదావరి -2.75 కోట్లు
    ఉత్తరాంధ్ర -4.24 కోట్లు

    మొత్తం ఏపీ షేర్ -36.87 కోట్లు

    కర్నాటక -3.67 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా -1.49 కోట్లు
    టోటల్ ఇండియా షేర్ -42.03 కోట్లు

    వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    Ram Charan starrer and Director VV Vinayak's latest Telugu movie Nayak has just broken the 2nd week collections record for Andhra Pradesh. Natak Total AP ast week Share 36.87Cr. This is all time record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X