twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'నాయక్‌' ఆడియో తేదీ ఛేంజ్

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్‌'. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల మొదట అనుకున్నట్లుగా డిసెంబర్ 15న కాకుండా డిసెంబర్ 16న జరగనుంది. ఈ మేరకు నిర్మాత ప్రకటన చేసి అఫీషియల్ గా ప్రకటించారు. రామానాయుడు సినీ విలేజ్ నానక్ రామ్ గూడా లో ఈ పంక్షన్ జరగనుంది.తెలుగు సిని ప్రముఖలు ఈ ఆడియో లాంచ్ కు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ లాంచ్ లో పాల్గొనే అవకాసముందని వినపడుతోంది.

    ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ -''ఈ చిత్రం నిర్మాతగా నాకే కాదు, లక్షలాది మెగా అభిమానులకు కూడా ప్రత్యేకమైన సినిమా. ఇందులో కొత్త చరణ్‌ని చూస్తారు. మెగాస్టార్‌ని తలపించేలా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. కాజల్, అమలాపాల్ అందచందాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి'' అని తెలిపారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాత డీవీవి దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రం గురించి వినాయిక్ మాట్లాడుతూ... ప్రపంచంలో ఆధిపత్యం చలాయించేవారు చాలా మంది ఉంటారు. వారెవరూ నిజమైన నాయకులు కారు. నిజమైన నాయకుడు జనం నుంచే పుడతాడు. జనం కోసమే బతుకుతాడు. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే నాయక్ కథాంశం ఇదే అన్నారు.

    అలాగే... నిత్యం నెత్తురు మండే యువకులే ఈ దేశానికి అవసరం... అన్నారు శ్రీశ్రీ. ఆ కుర్రాడు కూడా అచ్చం అలాగే ఉంటాడు. సరదాలూ, విలాసాలూ, వినోదాలూ అంటూ కాలాన్ని ఖాళీ చేయడం అతనికి ఇష్టం ఉండదు. లక్ష్యం తప్ప అతని కంటికి మరో వస్తువు కనిపించదు. తన ఒక్కడి కోసం కాదు.. తనని నమ్ముకొన్న అందరి కోసం ఓ పోరాటానికి సిద్ధమయ్యాడు. అదేమిటి? అందులో అతను విజయం సాధించాడా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు .

    రామ్‌ చరణ్‌ సరసన కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రధాన తారాగణంపై న్యాయస్థానానికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్‌ చేశారు. రామ్‌చరణ్‌, అమలాపాల్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కించారు. తమన్‌ సంగీతం అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు. ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌ సాయి. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.

    English summary
    Nayak's audio will be released on 16th December. After considering 14th and 15th of December for the release the film's audio, it will finally hit the market on the 16th December. The makers of the movie have confirmed this. The audio release ceremony will happen amidst much fanfare at Ramanaidu Cine Village, Nanakram Guda in Hyderabad. The event is expected to be a magnanimous one with many celebrities attending it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X