Annapoorani Collections నయనతార 75వ సినిమాకు షాకింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
ఇండియాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూర్ణ: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రం తమిళనాడులో రిలీజైంది. ఈ సినిమాలో జై సంపత్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్‌లే తదితరులు నటించారు. ట్రైడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీ స్టూడియో నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
అన్నపూర్ణి అనే చిత్రంలో భారీగా నటీనటులు తమ పాత్రలను పోషించారు. ఈ సినిమా నిర్మాణం, ప్రమోషన్స్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు అంతా కలిపితే ఈ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సినిమాను పెద్దగా ప్రమోషన్స్ చేపట్టకుండానే కేవలం తమిళనాడులోనే ఓ రేంజ్‌లో రిలీజ్ చేశారు.

జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించిన అన్నపూర్ణి సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఎస్ మ్యూజిక్ అందించారు. సత్య సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. నయనతార కెరీర్‌లో ఈ చిత్రం 75వ సినిమా కావడం విశేషంగా మారింది. అయితే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో తమిళనాడులో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది.
డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో కలెక్షన్లు ఊపందుకోలేకపోయాయి. దాంతో తొలి రోజు ఈ సినిమా 60 లక్షల రూపాయలు షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా భారీ పెరుగుదల బాక్సాఫీస్ వద్ద కనిపించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక అన్నపూర్ణి సినిమా రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. పెద్దగా పెరుగుదల కనిపించకపోయినా.. తొలి రోజు కంటే స్టడీగా కలెక్షన్లు ఉండటం ఊరట కలిగించింది. రెండో రోజు బాక్సాఫీస్ వద్ద 65 లక్షల షేర్ రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రెండు రోజుల్లో 1.25 కోట్ల కలెక్షన్లు వసూలు చేయవచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











