దుమ్మురేపుతున్న నయనతార.. అగ్రహీరోలను తలదన్నేలా.. లేడి సూపర్‌స్టార్ సూపర్ హిట్
Recommended Video

తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హవా కొనసాగుతున్నది. బాక్సాఫీస్‌పై ఆమె కలెక్షన్ల దాడిని కొనసాగిస్తున్నది. తమిళ పరిశ్రమలో కోకో కోకిల సాధించిన విజయాన్ని ఇంకా మరిచిపోక ముందే నయనతార నటించిన మరో చిత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన ఇమైక్క నాడిగల్ అనే చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నది. అగ్రహీరోల చిత్రాలను తలదన్నేలా ఇమైక్క నాడిగల్ వసూళ్లను సాధించడం చర్చనీయాంశమైంది.

తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు
నయనతార, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ హీరో అథర్వ, రాశీఖన్నా నటించిన ఇమైక్క నాడిగల్ చిత్రం ఆగస్టు 30న తమిళనాడు వ్యాప్తంగా రిలీజైంది. తొలి ఆట నుంచే ప్రేక్షకులను, సినీ విమర్శకులను విశేషంగా ఆకట్టుకొన్నది. సానుకూలమైన స్పందనతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి.

12 కోట్ల కలెక్షన్లు
వారాంతంలోనే ఈ చిత్రం రూ.12 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా సోమవారం కూడా భారీ కలెక్షన్లను సాధించడంతో ఈ సినిమాకు ఎదురులేకుండా పోయింది.

తమిళంలో తొలిసారి అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలిసారి నటుడిగా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించాడు. సైకో సీరియల్ కిల్లర్‌గా అనురాగ్ కశ్యప్ నటనకు ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఈ చిత్రంలో రుద్ర అనే పాత్రలో అనురాగ్ కనిపించారు.

పోలీస్ ఆఫీసర్‌గా నయనతార
ఇమైక్క నాడిగల్ చిత్రంలో వరుస హత్యలను ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నయనతార నటించారు. రాశీఖన్నా, అథర్వ ప్రేమజంటగా నటించారు. అయితే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

50 కోట్లవైపు పరుగులు
ఇలాంటి విశేషాలు ఉన్న ఇమైక్క నాడిగల్ ప్రేక్షకుల మన్ననలను అందుకొంటుంది. రానున్న రోజుల్లో కలెక్షన్ల ఊపు ఇలానే ఉంటే రూ.50 కోట్ల మార్కును అందుకునే అవకాశం లేకపోలేదనే మాట సినీవర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











