అఖండ తమిళ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా.. ఎంతకు అమ్మారంటే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో అఖండ సినిమా కూడా టాప్ లిస్టులో చేరింది. ఈ సినిమా మొత్తంగా రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసి నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. బోయపాటి శ్రీను కలయికలో బాలకృష్ణ మూడవ సినిమాగా వచ్చిన అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకుని చిత్ర పరిశ్రమకు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాను శుక్రవారం తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే అక్కడ ఈ సినిమాను ఎంతకు అమ్మారు? ఎంత వసూలు సాధిస్తే? బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

కష్టపడి తెచ్చుకున్న విజయం
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకున్నారు. ఈ సినిమా కోసం వారు చాలా కష్ట పడ్డారు అని చెప్పాలి ఆరు పదుల వయసులో కూడా బాలయ్య అఘోరా పాత్రలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. ఆ పాత్ర మేకప్ కోసమే గంటల తరబడి కదలకుండా ఎంతో ఓపికతో ఉండాల్సి వచ్చింది. ఇక బోయపాటి కూడా తన పారితోషికాన్ని కూడా త్యాగం చేసి ఈ సినిమా భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చాడు.

సౌత్ బెస్ట్ కాంబినేషన్
ఇదివరకే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదట వచ్చిన సింహా సినిమా తో పాటు ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. మూడు సార్లు కూడా వీరి కాంబినేషన్ సక్సెస్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలోనూ బెస్ట్ కాంబినేషన్ గా గుర్తింపు అందుకున్నారు.

తెలుగులో లాభాలు ఎంతంటే?
తెలుగులో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా 132 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోని ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేట్రికల్ గానే కాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా కలుపుకొని మొత్తంగా అఖండ సినిమా 200 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లుగా టాక్ గట్టిగానే వినిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు అయితే థియేట్రికల్ గా ఈ సినిమా 25 కోట్లకు పైగా లాభాలను అందించినట్లు సమాచారం.

తమిళంలో టార్గెట్ ఎంతంటే?
అయితే శుక్రవారం తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అఖండ సినిమాను డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. సినిమా తమిళంలో కోటి కంటే ధరకే అమ్మినట్లు తెలుస్తోంది. దాదాపు 65 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో సినిమా తమిళ్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే కనీసం 80 లక్షల షేర్ రాబట్టిన కూడా ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకున్న టు లెక్క. మరి కమర్షియల్ సినిమాలను అంతగా ఇష్టపడని తమిళ జనాలు అఖండ సినిమాను ఎంత వరకు సక్సెస్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











