700 కోట్ల బడ్జెట్.. 18 వేల కోట్ల కలెక్షన్లు.. వరల్డ్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా గురించి తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ మాధ్యమం ఏదైనా ఉందంటే అది వెండితెరపై సినిమా అని చెప్పవచ్చు ఇలా ఇన్నేళ్ల ప్రపంచ సినీ ప్రస్థానంలో ఆల్ టైం అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాలు కొన్ని కనిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన పలు భారీ చిత్రాలు అది కూడా టాప్ మోస్ట్ దర్శకులు, హీరోలు, సూపర్ హీరో జానర్ లో వచ్చిన సినిమాలు టాప్ 5 స్థానంలో కనిపిస్తుంటాయి.
కాగా ఈ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే వీటిని మించిన ఒక సినిమా మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ మోస్ట్ సినిమాలు లిస్ట్ చూసుకుంటే నంబర్ వన్ ప్లేస్ లో దర్శకుడు జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్' పార్ట్ వన్ నిలిస్తే..

దీని తర్వాత మార్వెల్ సినిమాస్ నుంచి వచ్చిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమా ఉంది వీటి తర్వాత అవతార్ రెండో భాగం నిలవగా నాలుగో ప్లేస్ లో మళ్లీ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన వింటేజ్ వండర్ 'టైటానిక్' సినిమా నిలిచింది. అయితే ఈ అన్ని సినిమాలు చూసుకున్నట్లయితే రెండు బిలియన్ డాలర్స్ కి పైగా వసూలు సాధించినవి ఉన్నాయి.
కాగా రెండు బిలియన్ డాలర్స్ అంటే ఇప్పుడు మన కరెన్సీలో చూసుకున్నట్లయితే ఏకంగా 20 వేల కోట్ల గ్రాస్ దగ్గరగా ఇవన్నీ అంతకుమించి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఈ అన్ని సినిమాలు మనుషులు వి ఎఫ్ ఎక్స్ అలాగే సూపర్ హీరో జానర్ లాంటి కొత్త అంశాలే ఎక్కువగా రియాల్టీ దగ్గరగా ఉన్నావు కనిపిస్తాయి.
కానీ ఒక్క సినిమా మాత్రం ఇప్పుడు ఈ అన్ని సినిమాల రికార్డ్స్ డేంజర్ లో పెట్టింది. అది కూడా వీటిలో రియాల్టీ సినిమా కూడా కాదు అది కేవలం ఒక యానిమేషన్ సినిమా కావడం అనేది గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ సినిమాలు కి మంచి ఆదరణ ఉంది. కానీ అలాంటి ఒక యానిమేషన్ ఉన్న ఈ తరహా భారీ చిత్రాలు రికార్డులను కొల్లగొట్టి ఆల్రెడీ టాప్ 5 ప్లేస్ కి రావడం అనేది బాక్సాఫీస్ పండితులను సైతం షాప్ కి గురిచేస్తుంది.
ఆ సినిమా ఏదంటే చైనా దేశం తెరకెక్కించిన "నే జః పార్ట్ 2'. దర్శకుడు జియాఓజి తెరకెక్కించగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 29న విడుదల అయ్యింది. అక్కడ నుంచి ఒక సెన్సేషనల్ లాంగ్ రన్ ని ఈ సినిమా కొనసాగిస్తుండగా ప్రస్తుతం ఏకంగా 2.15 బిలియన్ డాలర్లు వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సెట్ చేసింది.
అంటే 18 వేల కోట్లకి పైగా వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం విశేషం. కాగా ఈ సినిమాకి కేవలం బడ్జెట్ 700 కోట్లు మాత్రమే అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆల్రెడీ నెంబర్ 1 యానిమేటెడ్ సినిమాగా కొత్త రికార్డులు సెట్ చేసింది. ఇక వీటితో పాటుగా ఇపుడు స్టార్ వార్స్ సినిమాని దాటి వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల లిస్ట్ లో టాప్ 5కి వచ్చేసింది.
ఇలా ఒక యానిమేషన్ సినిమా ఈ రేంజ్ లో సంచలనం సెట్ చేస్తుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కాగా ఈ సినిమా ఇండియా రిలీజ్ కి కూడా రాబోతోంది. ఇండియాలో ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్ గా విడుదలకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటానిక్ ని బీట్ చేయొచ్చు అనే టాక్ ఎక్కువ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











