Bedurulanka 2012 Collections.. అంచనాలను బీట్ చేసిన కార్తీకేయ మూవీ.. బెదురులంకకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ హీరో, హీరోయిన్లు కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. నూతన దర్శకుడిగా పరిచయమైన క్లాక్స్ రూపొందించిన ఈ సినిమాను బెన్నీ అలియాస్ నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఓ మాదిరి అంచనాలతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసేలా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా గత 4 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే..
బెదురులంక ప్రీ రిలీజ్ బిజినెస్:బెదురులంక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం, ఆంధ్రాలో భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3.25 లక్షల రూపాయల బిజినెస్ నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి 85 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 4.10 కోట్ల రూపాయలు బిజినెస్ నమోదైంది. బెదురులంక సినిమా రిలీజ్‌కు సంబంధించి స్క్రీన్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 95 స్క్రీన్లలో, సీడెడ్‌లో 40 స్క్రీన్లు, ఆంధ్రాలో 130 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు:బెదురులంక సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో కలుపుకొని 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు సుమారు 2 కోట్లు రాబట్టింది. మూడో రోజు అంతకంటే ఎక్కువ జోష్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మూడో రోజు 2.62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు రాబట్టింది.

4వ రోజు ఆక్యుపెన్సీ :గోదావరి జిల్లాల యాసతో కూడిన కామెడీ చిత్రంగా రూపొందిన బెదురులంక మూవీకి మౌత్ టాక్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా నాలుగో రోజు అంటే.. బాక్సాఫీస్‌కు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం నిలకడగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది. నాలుగో రోజున ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 25 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

4వ రోజు బాక్సాఫీస్ రిపోర్టు:గత మూడు రోజుల్లో 7 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన బెదురులంక 2012 చిత్రం 4వ రోజు నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు 1 కోట్లు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

బెదురులంక లాభాల్లోకి రావాలంటే? :బెదురులంక 2012 సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 4.50 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకొన్నది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించడం రికార్డుగా మారింది. సూపర్ హిట్ టాక్‌ను దాటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకొన్నది.


Click it and Unblock the Notifications











