Rules Ranjann Collections రూల్స్ రంజన్‌కు 10 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వంలో దివ్యాంగ్ లావణ్య, వేమూరి మురళీకృష్ణ, రింకు కుక్రేజా నిర్మించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమాలో యువ హీరో, హీరోయిన్లు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించగా, అన్నూ కపూర్, వెన్నెల కిషోర్, మక్రంద్ దేశ్ పాండే, అజయ్, సుబ్బరాజు, గోపరాజు రమణ, హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, మెహర్ చాహల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆక్టోబర్ 8వ తేదీన రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే విషయాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే చిత్రంగా రూపొందింది. హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, వెన్నెల కిషోర్ లాంటి టాప్ కమెడియన్లు ఈ సినిమాలో నటించారు. ప్రేమ, పెళ్లి కాన్పెప్ట్‌కు హ్యూమర్ జోడించి నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. ఈ సినిమాకు తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ నమోదైంది.

Rules Ranjann movie official collections worldwide

రూల్స్ రంజన్ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కెమిస్ట్రీ బాగానే ఆకట్టుకొన్నది. సమ్మోహనుడా, ఇతర పాటలు అలరించాయి. నేహా శెట్టి స్క్రీన్ ప్రజెన్స్, గ్లామర్, అందాల ఆరబోత మాస్ ప్రేక్షకులకు మరింత జోష్‌ను కలిగించాయి. ఇలాంటి కమర్షియల్ వ్యాల్యూస్ ఉన్న రూల్స్ రంజన్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

రూల్స్ రంజన్ సినిమాను భారీ ఖర్చుతో తెరకెక్కించారు. కిరణ్ అబ్బవరం, టాప్ కెమెడియన్లు, నేహా శెట్టి, సుబ్బరాజు, అజయ్ లాంటి టాప్ యాక్టర్లు ఉండటంతో నిర్మాణ వ్యయం భారీగా అయింది. దాంతో దాదాపు 10 కోట్ల మేర బిజినెస్‌ను వ్యాల్యూ కట్టారు. ఈ సినిమాలోని పాటలు ట్రెండింగ్‌గా నిలువడంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

రూల్స్ రంజన్ చిత్రం తొలి రోజున మధ్యస్థంగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రూపాయల గ్రాస్‌ను, ప్రపంచవ్యాప్తంగా 1 కోటి రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయితే తొలి రోజు మౌత్ టాక్, కామెడీ అంశం కనెక్ట్ కావడంతో కొంత పాజిటివ్‌గా మారింది. కానీ ఈ సినిమా ముందు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.

Rules Ranjann movie official collections in India

ఇక రూల్స్ రంజన్ చిత్రానికి రెండో రోజు కొంత పాజిటివ్ కనిపించింది. మౌత్ టాక్ పాజిటివ్‌గా మారడంతో రెండో రోజు కొంత మెరుగ్గా కలెక్షన్లు నమోదయ్యాయి. రెండో రోజు 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 50 లక్షల రూపాయల గ్రాస్ ఓవర్సీస్‌లో రాబట్టింది. రెండో రోజు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

రూల్స్ రంజన్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. 10 కోట్ల మేర టార్గెట్ సెట్ చేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 10 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1.5 కోట్ల షేర్ రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X