Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘నేల టిక్కెట్టు’ బాక్సాఫీస్ రిపోర్ట్: వచ్చింది ఎంత? రావాల్సింది ఎంత?
Recommended Video
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'నేల టిక్కెట్' మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదు. సినిమా తొలి రోజు నుండే మిక్డ్స్టాక్ రావడం, క్రిటిక్స్ కూడా సినిమా యావరేజ్ అంటూ రివ్యూస్ ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లు మరింత డీలా పడ్డాయి. ఈ చిత్రం తొలి 3 రోజుల్లో కేవలం రూ. 8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఇందులో ఎక్కువ శాతం తొలి రోజు వసూలైందే కావడం గమనార్హం. రెండో రోజు నుండి కలెక్షన్స్ క్రమక్రమంగా డౌన్ అవుతున్నాయి. ఫస్ట్ వీకెండే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
వచ్చింది ఎంత? రావాల్సింది ఎంత?
‘నేల టిక్కెట్టు' ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలకు కలిపి రూ. 22 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ సగం షేర్ కూడా రాక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకు రూ. 8 కోట్లు వచ్చాయి. ఇంకా 14 కోట్ల షేర్ వసూలైతే తప్ప బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంటుంది. అంతకు మించి వసూలైతేనే లాభాలు వస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలైంది?
నైజాం, ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 6.77 కోట్ల షేర్ వసూలైంది. ఇందులో రూ. 3.49 కోట్లు తొలి రోజు వచ్చిన అమౌంటే కావడం గమనార్హం. నైజాంలో రూ. 2.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 63 లక్షలు, కృష్ణలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలు, ఈస్ట్ లో రూ. 63, లక్షలు, వెస్ట్‌లో రూ. 42 లక్షలు రాబట్టింది.
ఓవర్సీస్లో మరీ దారుణం
ఓవర్సీస్లో పరిస్థితి మీ దారుణంగా ఉంది. తొలి 3 రోజుల్లో కేవలం 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే రెస్టాఫ్ ఇండియాలో 1.15 కోట్లు రాబట్టింది.
మాస్ టైటిల్ కూడా ఓ కారణమా?
ఈ చిత్రానికి ‘నేల టిక్కెట్టు' అనే మాస్ టైటిల్ కూడా సినిమాపై క్లాస్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపక పోవడానికి కారణం అని భావిస్తున్నారు. మరి ఫుల్ రన్లో నేల టిక్కెట్టు ఎంత వసూలు చేస్తుందో చూడాలి.