రిలీజైన రెండు సినిమాలు ప్లాపులే (ట్రేడ్ టాక్)
క్రిందటి వారం రెండు తెలుగు చిత్రాలు ప్రేక్షకుల తీర్పును కోరుతూ వచ్చాయి. అవి రానా-ఇలియానాల 'నేను..నా రాక్షసి", గీతాకృష్ణ 'కాఫీబార్". ఈ రెండింటిలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చిత్రం పూరీ జగన్నాధ్ 'నేను..నా రాక్షసి".ఆత్మహత్యల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం చూసిన వారికి,తీసిన వారికే కాక కొనుక్కున్న వారికి కూడా ఆత్మహత్యా సదృశ్యంగా మారింది. మూడో సినిమా కూడా రానాకి కలిసిరాలేదు.అలాగే శక్తి,రెచ్చిపో,సలీం అంటూ వరస ఫ్లాపుల్లో ఉన్న ఇలియానాకు సైతం ఈ ప్లాపు ఊహించని పరిణామమే.పూరీ జగన్ కి సైతం గోలీమార్ ,బుజ్జిగాడు మేడిన్ చెన్నై,ఏక్ నిరంజన్ చిత్రాల వరస ఫ్లాపుల లిస్టులో ఇదీ చేరిపోయి నిరాస మిగిల్చింది.
ప్రేక్షకుల సహనానికి పరీక్షలా తయారైన ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్లు కూడా డల్‌గా వున్నాయి. ఇక చాలా కాలంగా విడుదలకు నోచుకోక మరుగున పడ్డ గీతాకృష్ణ 'కాఫీబార్" ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయాన్ని చవిచూసింది. ఇలా ఈ వారం విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాయి.అంతకుముందు వారం విడుదలైన ప్రభాస్ చిత్రం 'మిస్టర్ పర్‌ఫెక్ట్" కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించి తెలుగు పరిశ్రమకు ఊరటకలిగించింది. అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకునేటట్లు చేసింది.


Click it and Unblock the Notifications











