Nenu Student Sir closing Collections టాక్ బాగున్నా కలెక్షన్లు నిల్. నేను స్టూడెంట్ సార్‌కు ఎంత నష్టమంటే?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు గణేష్ హీరోగా, ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతికా దస్సానీ జంటగా నటించిన చిత్రం నేను స్టూడెంట్ సార్. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యాంగర్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నూతన దర్శకుడు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే గత మూడు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
విభిన్నమైన పాయింట్‌తో నేను స్టూడెంట్ సార్ అనే చిత్రాన్ని నిర్మాత నాంది సతీష్ వర్మ రూపొందించారు. ఈ సినిమాను సుమారు 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాను 400 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

నేను స్టూడెంట్ సార్ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. ప్రేక్షకులను థియేటర్‌కు భారీగా రప్పించలేకపోయింది. విడుదలైన ప్రతీ చోట ఆక్యుపెన్సీ యావరేజ్‌గా నమోదైంది. దాంతో భారీగా వసూళ్లను రాబట్టలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మంచి టాక్ వచ్చినా కలెక్షన్ల రాకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
నేను స్టూడెంట్ సార్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు ఈ సినిమా 60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు 65 లక్షల రూపాయలు, మూడో రోజు 75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం తొలి వారాంతంలో 1.95 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఇక తొలి వారాంతం తర్వాత నేను స్టూడెంట్ సార్ చిత్రం కలెక్షన్ల పరంగా పుంజుకోలేకపోయింది. నాలుగో రోజున దాదాపు 75 శాతం కలెక్షన్లు పడిపోయాయి. నాలుగో రోజున 25 లక్షల రూపాయలు, 5వ రోజున 20 లక్షల రూపాయలు, ఆరో రోజున 15 లక్షల రూపాయలు, ఏడో రోజున 10 లక్షల రూపాయల వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలివారంలో 2.70 కోట్ల గ్రాస్, 1 కోటి రూపాయలకుపైగా షేర్ వసూలు చేసింది.
నేను స్టూడెంట్ సార్ చిత్రం తొలివారంలోనే చాలా చోట్ల థియేటర్ల నుంచి ఎత్తేశారు. ప్రధాన సెంటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను దాదాపు ముగించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్‌గా నష్టాల్లోనే ముగిసిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇక ఓటీటీలో ఈ సినిమా రావడం ఖాయమైంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











