మహేష్ బాబు ఇప్పటికే కృష్ణ ప్రొడక్షన్స్,ఇందిర ప్రొడక్షన్స్ ,పద్మాలయా బ్యానర్ అనే బ్యానర్స్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.అయితే అవన్నీ ప్రక్కన పెట్టి భార్య నమ్రతా శిరోధ్కర్ ని నిర్మాతను చేస్తూ సొంత బ్యానర్ ని స్ధాపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుడు సినిమా పూర్తయ్యే లోగా ఈ బ్యానర్ తన పనులను ప్రారంభిస్తుంది. మొదటి ప్రాజెక్టు సంచలనం సృష్ఠించేలా ఉండాలని మహేష్ చెప్పటంతో ఆమె రకరకాల కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంత్రి,భిల్లా చిత్రాల మెహర్ రమేష్ ఆ వరసలో మొదట ఉన్నట్లు సమాచారం. ఇక హారోలు చాలా మంది తమ సొంత బ్యానర్స్ ని రకరకాల కారణాలతో స్ధాపించటం తెలిసిందే. కొందరు ఇనకంటాక్స్ ప్లాభ్లమ్ తో నయితే మరికొందరు కుటుంబ సమస్యలతో ఈ తరహా సన్నివేశాలుకు తెరతీస్తారు. అయితే మహేష్ ది మాత్రం ఇంటి సమస్యే నంటున్నారు. ఎప్పటినుంచో నలుగుతున్న ఈ వ్యవహారం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Story first published: Sunday, April 12, 2009, 15:28 [IST]