»   » రిజిస్టర్ అయిన టైటిల్స్...మరి ఈ హీరోలకు సెట్ అవుతాయా...లేదో చెప్పండి

రిజిస్టర్ అయిన టైటిల్స్...మరి ఈ హీరోలకు సెట్ అవుతాయా...లేదో చెప్పండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాకు టైటిలే కీలకం. అందుకే సినిమావాళ్లు ఆచి తూచి తమ సినిమాలకు టైటిల్స్ పెడుతూంటారు. సినిమా టైటిల్ తోనే బిజినెస్ జరిగి, ఓపినింగ్స్ తెచ్చుకున్న ధాకలాలు కూడా ఉన్నాయి. ఓ రైటర్... సినిమా కథ చెప్తున్నప్పుడే టైటిల్ ఏంటి అని అడుతూంటారు నిర్మాతలు.

అయితే ఆ టైటిల్స్ పెట్టడంలో కూడా విభిన్న పోకడలు పోతున్నారు. కొందరైతే క్యాచీగా ఉండే టైటిల్ కావాలనుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే జన బాహుళ్యంలో నలిగిన పదాన్ని టైటిల్ గా పెడితే జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్తుందని భావిస్తున్నారు.

ఈ టైటిల్స్ కోసం నిరంతంరం ఆలోచనలు టాలీవుడ్ లో సాగుతూనే ఉన్నాయి. టైటిల్స్ కోసం ఇంతకు ముందు నిర్మాతల మధ్యన గొడవలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అందుకే టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టారు. సినిమా ప్రారంభిద్దామనుకునేవారు టైటిల్ ని బ్యానర్ తో సహా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంతేకాదు ఆ టైటిల్ ని ఎప్పటికప్పుడూ కాపాడుకుంటూ రెన్యువల్ సైతం చేయించుకోవాలి.

తమ కథకు సెట్ అవుతుందనుకున్న టైటిల్ వేరే వారు రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ..ఆ మొదట రిజిస్ట్రేషన్ చేయించుకునేవారిని సంప్రదించి సెటిల్ చేసుకోవటం చాలా సార్లు జరుగుతూ వస్తోంది. అయితే పెద్ద నిర్మాతలు తమకు కావాల్సిన టైటిల్ తీసేసుకంటున్నారంటూ గతంలో ఢమరకం, ఖలేజా, కత్తి వంటి చిత్రాలు విషయాలు మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ జరిగాయి.

ఇక రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్న టైటిల్స్ ఇస్తున్నాం..

బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం కోసం అల్లుడు బంగారం టైటిల్ రిజిస్టర్ చేసారు.

రామ్

రామ్

14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సాయి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందే చిత్రనికి హైపర్ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు.

తేజ

తేజ

రానా, కాజల్, కేధరిన్ కాంబినేషన్ లో తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి చరిత్ర అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు రిజిస్టర్ చేసారు.

మంచు విష్ణు

మంచు విష్ణు

మంచు విష్ణు తమ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై దుమ్ము రేపుతాము అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. మరి ఏ సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసారో చూడాలి.

నాని

నాని

నక్కిన త్రినాధరావు, నాని కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి నేను లోకల్ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు దిల్ రాజు.

ఉషా కిరణ్ మూవీస్

ఉషా కిరణ్ మూవీస్

రామోజీరావు గారు అప్పట్లో వచ్చిన శ్రీవారి ప్రేమ లేఖ సూపర్ హిట్. ఇప్పుడు శ్రీవారికి ప్రేమ లేఖ -2 అంటూ టైటిల్ రిజిస్టర్ చేసారు.

English summary
Some new titles are registered at Film Chamber of commerce. Sri Lakshmi Prasanna Pictures has registered a title ‘Dummu Reputhamu’. Dil Raju registered ‘Nenu Local’ title for Nani’s movie in the direction of Trinadha Rao. ‘Alludu Bangaram’ has been registered by Bellamkonda Suresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu