twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త సంవత్సరం..చెత్త సినిమాలతో(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    2010 కొత్త సంవత్సరం ప్రారంభమై ప్లాపు లతో ప్రారంభమైంది. నూతన సంవత్సర కానుకగా ముచ్చటగా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు తెలుగు స్ట్రైయిట్ చిత్రాలు కాగా,ఒకటి తమిళ డబ్బింగ్ చిత్రం. అయితే సంవత్సరం ప్రారంభమే మూడు చిత్రాలు ఫ్లాఫ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. అందులో జగపతిబాబు హీరోగా వచ్చిన మా నాన్న చిరంజీవి చిత్రం అయితే ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టింది. హాలీవుడ్ చిత్రం పర్షూట్ ఆఫ్ హ్యాపీనెస్ ను ప్రీమేక్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం టీవి సీరియల్ వాతావరణాన్ని తలిపించింది.పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ తమ్ముడు చిత్రంతో పరిచయమైన అరుణ్ ప్రసాద్ రూపొందించిన చిత్రమేనా అని అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

    ఇక రెండో చిత్రం యుగళ గీతం. యూత్ ని టార్గెట్ చేస్తూ యూత్ తో తీసిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేక చతికలపడింది. శ్రీకర్, సోనీ శర్మిష్టా నటించిన ఈ చిత్రంతో శివాజి అనే నూతన దర్శకుడు పరిచయమయ్యాడు. అయితే కథ చెప్పే విధానంలో కొత్త దర్శకుడు తడపడటం, ఆర్టిస్టులు సరిగా తన నటనను పండించలేకపోవటం సినిమాను దిగజార్చాయి.ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయిన ఈ చిత్రం వారం కూడా ఆడటం కష్టమే.

    ఇక తమిళ డబ్బింగ్ చిత్రం ప్రేమిస్తూ అయితే మరీ ఘోరంగా అసలు రిలీజైందనే చాలా మందికి తెలియకుండా పోయింది. ఎప్పుడో 1994లో వచ్చిన ఈ చిత్రం అస్తవ్యస్త కధనాలతో సహన పరీక్షకు గురిచేసింది. శ్రీనాధ్, స్వాతి నటించిన ఈ చిత్రాన్ని రాఘవేంద్ర డైరక్ట్ చేసారు. ఈ మూడు వరస ప్లాపులూ అంతకు ముందు రిలీజైన అవతార్ కలెక్షన్స్ కి ఇవి తోర్పడినట్లయ్యాయి. హైదరాబాద్ లో ఈ కొత్త రిలీజ్ లతో పోలిస్తే త్రి ఇడియట్స్, అవతార్ కలెక్షన్స్ చాలా చాలా బావున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X