న్యూస్ కొంచెం బెటర్
ఈ వారం రెండు తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలైనా వీటిలో ఉపేంద్ర కన్నడ చిత్రానికి తెలుగు అనువాదమైన న్యూస్ కొంచెం బెటర్. రామ్‌గోపాల్ వర్మ ర వితేజ హీరోగా నిర్మించిన షాక్‌లో నవరసాలు ఉన్నా కథలో లోపం కారణంగా సెకండాఫ్‌లో హీరో క్యారెక్టర్ పాసివ్‌గా మారిపోయి కథనం గంద్రగోళంలో పడడంతో ప్రేక్షకులకు షాక్ కొట్టినంత పనవుతోంది. ఊహించని సన్నివేశాలతో వైవిధ్యభరితమైన కథనంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించదు. సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన పోతే పోనీని ప్రేక్షకులు లైట్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ నేపధ్యం నుంచి వచ్చిన భరద్వాజ మంచి సందేశం ఉన్న చిత్రం తీయాలనుకున్నారు కానీ ట్రీట్‌మెంట్‌లో లోపం వల్ల సెకండాఫ్ ఒక డాక్యుమెంటరీలా సాగుతుంది. మాధవన్ తమిళ చిత్రం తెలుగు అనువాదం జగన్ ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించలేకపోతోంది. హిట్ చిత్రాలుగా ఈ ఏడాది మొదట్లోనే బోణీ చేసిన లక్ష్మి స్టైల్ చిత్రాలు బాక్సాఫీసు అగ్రభాగాన కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











