‘NGK’ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్: సూర్య మూవీ లాభాలతో గట్టెక్కే పరిస్థితి ఉందా?
తమిళ స్టార్ సూర్య నటించిన 'NGK' (నంద గోపాల కృష్ణ) చిత్రానికి మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంలో తోడ్పడింది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు ఇక్కడ రూ. 9 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండటంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించడంలో సఫలమైంది.

ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ఎంతంటే..?
సినిమాపై మిక్డ్స్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు కాస్త తగ్గాయి. శనివారం ఈ చిత్రం తమిళనాడు వ్యాప్తంగా రూ. 6 కోట్లు రాబట్టింది. ఆదివారం వసూళ్లు పుంజుకుంటాయని భావించినా అలాంటి మ్యాజిక్ ఏమీ జరుగలేదు. రూ. 5 కోట్లుతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ గ్రాస్ రూ. 20 కోట్లకు చేరుకుంది.

చెన్నైలో అదరగొడుతోంది
అయితే చెన్నై సిటీలో మాత్రం ఈ మూవీ తొలి రోజు రూ. 1.03 కోట్లు వసూలు చేసి సూర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక్కడ రెండో రోజు సైతం రూ. 1.07 కోట్ల వసూళ్లతో సూపర్బ్ అనిపించింది. ఆదివారం రూ. 97 లక్షలు రాబట్టింది. దీంతో చెన్నై సిటీ 3 డేస్ టోటల్ రూ. 3.07 కోట్లకు చేరుకుంది.

లాభాల్లోకి రావాలంటే
‘NGK' మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. సినిమా ప్రాఫిట్ జోన్లోకి రావాలంటే రూ. 65 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాకు టాక్ డీసెంటుగా ఉండటం, ఈ వారం ఈద్ హాలిడే వస్తుండటంతో లాభాల జోన్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

తెలుగులో అంతంత మాత్రమే
ఇక తెలుగులో కూడా ‘NGK' కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నైజాం ఏరియాలో ఫస్ట్ వీకెండ్ రూ. 1.05 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద సూర్య చిత్రానికి ‘ఫలక్‌నుమా దాస్' మూవీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో పాటు ‘మహర్షి' చిత్రం కూడా పోటీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











