twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చేలా NGK కలెక్షన్లు.. ఒపెనింగ్స్‌తో అదరగొడుతున్న సూర్య

    |

    Recommended Video

    'NGK' Telugu Movie 1st Day Collections!! | Suriya | Rakhul | Sai Pallavi

    దక్షిణాదిలో విలక్షణ హీరో సూర్య నటించిన NGK చిత్రం విడుదలై సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కొంటున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. తమిళనాడులో భారీ కలెక్షన్లను సాధిస్తుండటం ట్రేడ్ వర్గాలను హుషారెత్తిస్తున్నది. తొలిరోజు ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

    చెన్నైలో ఘనంగా ఓపెనింగ్స్

    చెన్నైలో ఘనంగా ఓపెనింగ్స్

    NGK మూవీ రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రహ్మండమైన వసూళ్లు నమోదు చేసుకొన్నది. కేవలం చెన్నై నగరంలోనే తొలి రోజు రూ.1.03 కోట్లు వసూలు చేసింది. సూర్య కెరీర్‌లో చెన్నైలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం అని ట్రేడ్ అనలిస్టు ఎల్ఎమ్ కౌశిక్ ట్వీట్ చేశారు.

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో వసూళ్లు

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో వసూళ్లు

    NGK చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మార్చి 30న అంటే రిలీజ్‌కు ముందు రోజు యూఎస్‌లో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా భారీగా వసూళ్లు నమోదయ్యాయి. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం రూ.37 లక్షలు, శుక్రవారం రూ.20 లక్షలు వసూలు చేసింది అని రమేష్ బాలా ట్వీట్ చేశారు.

    వారాంతంలో కలెక్షన్లను బట్టే

    వారాంతంలో కలెక్షన్లను బట్టే

    అయితే శని, ఆదివారాల్లో వసూలయ్యే కలెక్షనను బట్టి సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేలడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఓపెనింగ్స్ మాదిరిగానే వారాంతం తర్వాత నిలకడగా వసూళ్లు సాధిస్తాయా అనే విషయం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. ఒకవేళ క్రిటిక్ అభిప్రాయాలను ఎదురించి వసూళ్లను సాధిస్తే సూర్యకు బాక్సాఫీస్ వద్ద ఎదురే ఉండదు అనే మాట వినిపిస్తున్నది.

     NGK కథ ఇదే

    NGK కథ ఇదే

    నంద గోపాల కృష్ణ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారడం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదురించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం అనే కథతో NGK చిత్రం తెరకెక్కింది. NGK భార్యగా సాయిపల్లవి, కార్పోరేట్ పీఆర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కనిపించారు.

    English summary
    Suriya who has different image and is quite popular with his films 'Gajini' and 'Singam' Series is coming with an interesting political thriller 'NGK' (Nanda Gopala Krishna). Director Sri Raghava is directing this film while SR Prakash Babu, SR Prabhu are producing under Dreamwarrior Pictures along with Reliance Entertainments. This movie released on May 31st and get good response at Box office in TN and overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X