Committee Kurrollu 11 Days Collection: నిహారికకు జాక్‌పాట్.. చిన్న మూవీ సంచలనం.. లాభమే అన్ని కోట్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో పల్లెటూరి నేపథ్యంలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటికే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఇలా ఇటీవలే విడుదలైన మరో సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు' ఒకటి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా మంచి బజ్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇది యూనిట్ నమ్మకాన్ని నిలబెడుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫలితంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. మరి 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా 11 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
కమిటీ కుర్రోళ్ళు వచ్చారు
పల్లెటూరి నేపథ్యంతో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

నిహారిక మూవీకి బిజినెస్
మెగా డాటర్ నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో నిర్మించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
10 రోజుల్లో ఎంతొచ్చింది?
ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్టుతో కూడిన కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ మూవీ పది రోజుల్లోనే రూ. 7.00 కోట్లు షేర్, రూ. 12.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

11వ రోజు ఇలా.. మొత్తంగా
'కమిటీ కుర్రోళ్ళు' మూవీకి 11వ రోజు రెస్పాన్స్ కాసింత తగ్గిపోయింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 35 లక్షలు షేర్ వసూలు చేసింది. ఇలా 11 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.77 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలు రాట్టింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 11 రోజుల్లో రూ. 7.37 కోట్లు షేర్, రూ. 12.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.00 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే రూ. 3.25 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 11 రోజుల్లో దీనికి రూ. 7.37 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.12 కోట్లు లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











