Committee Kurrollu 15 Days Collection: కుర్రోళ్ళతో నిహారిక గొప్ప రికార్డు.. 15 రోజుల్లో కోట్ల వర్షం

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రవేశించారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో మెప్పించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు అలానే పేరు తెచ్చుకునేందుకు 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాతో నిర్మాతగా టాలీవుడ్‌లో ప్రయాణాన్ని మొదలు పెట్టింది నిహారిక కొణిదెల. మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ వెళ్తోంది. మరి 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా 15 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

వాళ్లతో వచ్చేసిన నిహారిక
పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు.

Niharika Konidela Committee Kurrollu Movie 15 Days Official Box Office Collections

నిహారిక మూవీకి బిజినెస్
పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో నిర్మించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది.

14 రోజుల్లో ఎంతొచ్చింది?
రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ మూవీ పది రోజుల్లోనే రూ. 7.95 కోట్లు షేర్, రూ. 14.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Niharika Konidela Committee Kurrollu Movie 15 Days Official Box Office Collections

15వ రోజు ఇలా.. మొత్తంగా
'కమిటీ కుర్రోళ్ళు'‌ మూవీకి 15వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గిపోయింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 23 లక్షలు షేర్ వసూలు చేసింది. ఇలా 15 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.53 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 67 లక్షలు రాట్టింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 15 రోజుల్లో రూ. 8.20 కోట్లు షేర్, రూ. 14.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.00 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే రూ. 3.25 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 15 రోజుల్లో దీనికి రూ. 8.20 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.95 కోట్లు లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X