Committee Kurrollu Collection: కుమ్మేసిన నిహారిక సినిమా.. 2 రోజుల్లో ఊహించని విధంగా.. హిట్ కావాలంటే!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇప్పుడు ఎన్నో రకాల చిత్రాలు వస్తున్నాయి. అందులో గతాన్ని గుర్తు చేసేలా కొన్ని పల్లెటూరి సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు తెలుగులో అలా వచ్చిన మూవీనే 'కమిటీ కుర్రోళ్ళు'. 1990 పరిస్థితులకు అద్దం పట్టే కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. దీంతో ఇది ఎన్నో అంచనాలతో శుక్రవారమే విడుదలైంది. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!
కమిటీ కుర్రోళ్ళు వచ్చేశారు
పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

నిహారిక మూవీకి బిజినెస్
నిర్మాతగా ఇప్పటి వరకూ వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లకే పరిమితం అయిన నిహారిక.. తొలిసారి ప్రొడ్యూస్ చేసిన ఫీచర్ ఫిల్మే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 2.50 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. తొలి రోజే
పాత రోజులను గుర్తు చేసే కాన్సెప్టుతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇంకో పది లక్షలు కలుపుకుని రూ. 85 లక్షలు షేర్‌ను, 1.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

2వ రోజు ఇలా.. మొత్తంగా
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే రెండో రోజు కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 80 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 95 లక్షలు రాబట్టింది. ఇలా రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1.80 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











