Committee Kurrollu 21 Days Collection: 3 కోట్ల సినిమా.. 3 వారాల్లో ఊహించని వసూళ్లు.. నిహారికకు జాక్‌పాట్
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ఎంతగానో కృషి చేస్తోంది నిహారిక కొణిదెల. ఆరంభంలో హీరోయిన్‌గా పలు చిత్రాలతో వచ్చిన ఈ భామ.. హిట్‌ను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాతో నిర్మాతగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మంచి ఆదరణను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా భారీ వసూళ్లతో సూపర్ హిట్ అయింది. మరి 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా 21 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
కమిటీ కుర్రోళ్ళు వచ్చారు
పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ రూపొందిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలను పోషించారు.

నిహారిక మూవీకి బిజినెస్
మెగా డాటర్ నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై గతంలోనే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో నిర్మించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
20 రోజుల్లో ఎంతొచ్చింది?
పల్లెటూరి నేపథ్యంతో ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఈ మూవీ ఇరవై రోజుల్లోనే రూ. 9.49 కోట్లు షేర్, రూ. 17.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

యదు వంశీ రూపకల్పనలో వచ్చిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. మంచి ప్రచారం చేసుకుని రిలీజ్ అయిన ఈ మూవీ సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమా 21 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.82 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు రాట్టింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 21 రోజుల్లో రూ. 9.62 కోట్లు షేర్, రూ. 17.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.00 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే రూ. 3.25 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 21 రోజుల్లో దీనికి రూ. 9.62 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.37 కోట్లు లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











