Committee Kurrollu 3 Days Collection: 3 రోజుల్లోనే బిజినెస్ ఔట్.. టాలీవుడ్‌లో నిహారిక గ్రేట్ రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగా సపోర్ట్‌తో వచ్చినా హీరోయిన్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయింది నిహారిక కొణిదెల. దీంతో సినిమాల్లో నటించడం ఆపేసిన ఈ భామ.. నిర్మాతగా వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా 'కమిటీ కుర్రోళ్ళు' అనే ఫీచర్ ఫిల్మ్‌తో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇది ఎన్నో అంచనాలతో శుక్రవారమే విడుదలైంది. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో మంచి టాక్ లభించింది. ఫలితంగా ఈ మూవీకి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' మూడు రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి మరి!
కమిటీ కుర్రోళ్ళు ఎంటర్
గ్రామీణ పరిస్థితులకు అద్దం పట్టే కథతో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ప్రధాన పాత్రలు చేసిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నిహారిక మూవీకి బిజినెస్
గతంలో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే చేసిన నిహారిక.. తొలిసారి టాలీవుడ్‌లో నిర్మించిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 2.50 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
అలాంటి టాక్.. 2 రోజుల్లో
90 నాటి కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఇలా వరల్డ్ వైడ్‌గా రూ. 85 లక్షలు షేర్‌ను, 1.60 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక, శనివారం కోటి పైనే రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లోనే రూ. 1.95 కోట్లు షేర్, రూ. 3.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

3వ రోజు ఇలా.. మొత్తంగా
మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే మూడో రోజు కూడా రెస్పాన్స్ పెరిగిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.00 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.10 కోట్లు రాబట్టింది. ఇలా 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 3.05 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఔట్.. రికార్డుతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 2.50 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.00 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 3 రోజుల్లో దీనికి రూ. 3.05 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5 లక్షలు లాభాలు కూడా వచ్చాయి. అదే సమయంలో నిహారిక టాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకుని రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











