Committee Kurrollu 4 Days Collection: కుమ్మేసిన నిహారిక మూవీ.. ఊహకందని వసూళ్లు.. లాభం ఎంతంటే!

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో డిఫరెంట్ కాన్సెప్టు మూవీలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రం పల్లెటూరి పరిస్థితులకు అద్దం పట్టే కథనాలతో రూపొందుతోన్నాయి. అలా ఇటీవలే విడుదలైన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కావడంతో ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' 4 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి మరి!

కమిటీ కుర్రోళ్ళు వచ్చారు
పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కథతో.. పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు నటించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.

Niharika Konidela Committee Kurrollu Movie 4 Days Official Box Office Collections

నిహారిక మూవీకి బిజినెస్

నిహారిక కొణిదెల గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే చేసింది. అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో నిర్మించిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి ఈ సినిమా రూ. 2.50 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అలాంటి టాక్.. 3 రోజుల్లో
ఫన్ అండ్ ఎమోషన్స్‌తో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 లక్షలు షేర్‌ను రాబట్టింది. రెండో రోజు రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. ఇక, మూడో రోజు ఏకంగా రూ. 1.20 కోట్లు రాబట్టింది. ఇలా 3 రోజుల్లోనే రూ. 3.15 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Niharika Konidela Committee Kurrollu Movie 4 Days Official Box Office Collections

4వ రోజు ఇలా.. మొత్తంగా

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే రెస్పాన్స్ రాబడుతోంది. అయితే, నాలుగో రోజు ఇది కాస్త డౌన్ అయింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 65 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 70 లక్షలు రాబట్టింది. ఇలా 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 3.85 కోట్లు షేర్‌ రాబట్టి సత్తా చాటుకుంది.

Niharika Konidela Committee Kurrollu Movie 4 Days Official Box Office Collections

టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 2.50 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.00 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 4 రోజుల్లో దీనికి రూ. 3.85 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 85 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X