Committee Kurrollu 7 Days Collection: కుమ్మేసిన కుర్రోళ్లు.. నిహారిక మరో రికార్డు.. వారంలో లాభం ఎంతంటే!

టాలీవుడ్‌లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా సరైన హిట్‌ను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది మెగా డాటర్ నిహారిక. హీరోయిన్‌గా ఎన్నో పరాజయాలను చూసిన ఆమె.. అప్పటి నుంచి తెరకు దూరంగా ఉంటోంది. అయితే, ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా తన మొదటి చిత్రంతో వచ్చింది. అదే గ్రామీణ కథాంశంతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు'. ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం అంచనాలను నిలబెట్టుకుని సత్తా చాటింది. ఫలితంగా దీనికి వసూళ్లు భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' 7 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి మరి!

కమిటీ కుర్రోళ్ళు జాతర
1990వ దశకం నాటి కథతో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు నటించిన ఫీల్ గుడ్ సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చాడు.

Niharika Konidela Committee Kurrollu Movie 7 Days Official Box Office Collections

నిహారిక మూవీకి బిజినెస్
నిహారిక కొణిదెల గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో ప్రొడ్యూస్ చేసిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి ఈ సినిమా రూ. 2.50 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది.

6 రోజుల్లో ఎంతొచ్చింది?
పూర్తి స్థాయి కామెడీ, భావోద్వేగంతో కూడిన కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఈ మూవీ ఆరు రోజుల్లోనే రూ. 4.60 కోట్లు షేర్, రూ. 9.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Niharika Konidela Committee Kurrollu Movie 7 Days Official Box Office Collections

7వ రోజు ఇలా.. మొత్తంగా
నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే సాగిపోతోంది. అయితే, ఆరో రోజు ఇది కాస్త డౌన్ అయింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 40 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 45 లక్షలు రాబట్టింది. ఇలా 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 5.05 కోట్లు షేర్‌, రూ. 11.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 2.50 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.00 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 7 రోజుల్లో దీనికి రూ. 5.05 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.05 కోట్లులు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X