Committee Kurrollu 8 Days Collection: నిహారిక మూవీకి భారీ వసూళ్లు.. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయంటే!

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో అదే తరహాలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అలా ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన మూవీనే 'కమిటీ కుర్రోళ్ళు'. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా 8 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి మరి!

కమిటీ కుర్రోళ్ళు వచ్చారు
పల్లెటూరి నేపథ్యం ఉన్న స్టోరీతో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు నటించిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చాడు.

Niharika Konidela Committee Kurrollu Movie 8 Days Official Box Office Collections

నిహారిక మూవీకి బిజినెస్
నిహారిక కొణిదెల తన బ్యానర్‌పై ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో ప్రొడ్యూస్ చేసిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది.

7 రోజుల్లో ఎంతొచ్చింది?
కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్లతో కూడిన కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఈ మూవీ ఏడు రోజుల్లోనే రూ. 5.01 కోట్లు షేర్, రూ. 9.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Niharika Konidela Committee Kurrollu Movie 8 Days Official Box Office Collections

8వ రోజు ఇలా.. మొత్తంగా
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ అయిన 'కమిటీ కుర్రోళ్ళు'‌ టాక్‌కు అనుగుణంగానే సాగిపోతోంది. అయితే, 8వ రోజు ఇది కాస్త డౌన్ అయింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 35 లక్షలు షేర్ వసూలు చేసింది. ఇలా 8 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.36 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు రాట్టింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 8 రోజుల్లో రూ. 5.88 కోట్లు షేర్, రూ. 11.15 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.25 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 8 రోజుల్లో దీనికి రూ. 5.88 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.63 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X