Committee Kurrollu 9 Days Collection: మరో రికార్డు కొట్టిన నిహారిక.. కమిటీ కుర్రోళ్ళకు లాభం ఎంతంటే!
టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ వారసులు సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నిర్మాతలుగా మారి సినిమాలు తెస్తున్నారు. తద్వారా కొత్త టాలెంట్లను వెలికితీసి పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. తాజాగా ఆమె నిర్మించిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లే ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుని దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి!
కమిటీ కుర్రోళ్ళు రచ్చగా
రియలిస్టిక్ స్టోరీతో పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

నిహారిక మూవీకి బిజినెస్
పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే నిర్మించింది అలాంటిది ఆమె తొలిసారి టాలీవుడ్‌లో ప్రొడ్యూస్ చేసిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రమోట్ చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
8 రోజుల్లో ఎంతొచ్చింది?
ఫన్ అండ్ ఎమోషనల్ కాన్సెప్టుతో కూడిన కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఆరంభం నుంచీ మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ మూవీ ఎనిమిది రోజుల్లోనే రూ. 5.88 కోట్లు షేర్, రూ. 11.15 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

9వ రోజు ఇలా.. మొత్తంగా
'కమిటీ కుర్రోళ్ళు' మూవీకి 9వ రోజు రెస్పాన్స్ మరింతగా పెరిగింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 52 లక్షలు షేర్ వసూలు చేసింది. ఇలా 9 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.88 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 56 లక్షలు రాట్టింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 9 రోజుల్లో రూ. 6.44 కోట్లు షేర్, రూ. 12.00 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఔట్.. లాభాలతో
'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.00 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.25 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 9 రోజుల్లో దీనికి రూ. 6.44 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.19 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











