Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కార్తికేయ 2కి భారీ డిమాండ్.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు.. అప్పుడే 20కోట్లు?
ఇండస్ట్రీలో ఓ వర్గం హీరోలు చాలా కష్టపడి వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను చేసుకుంటున్నారు.ఒకప్పుడు బాలనటుడిగా చేసిన నిఖిల్ కూడా ప్రస్తుతం యువ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను క్రేజ్ ను అందుకుంటూ వస్తున్నాడు. హ్యాపీ డేస్ నుంచి చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటూ వస్తున్నాడు.
ఇక ఎలాంటి సినిమా చేసినా సరే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అడ్డుకుంటున్న నిఖిల్ సిద్ధార్థ్ కేవలం సినిమాలలోనే కాకుండా అప్పుడప్పుడు మంచి పనులతో కూడా ఆడియన్స్ మనసులు గెలుచుకుంటున్నాడు. ఇక ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో కార్తికేయ సినిమా కూడా ఉంది. ఇక కార్తికేయ 2 అంటూ ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అప్పుడే 20 కోట్ల వరకు
అయితే సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో ఆఫర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు అప్పుడే 20 కోట్ల వరకు లాభాలను అరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఏ సినిమా అయినా సరే కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా మంచి లాభాలను అందుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమా బిజినెస్ అంటే కేవలం థియేటర్స్ బిజినెస్ మీదనే ఆధారపడి ఉండేది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తే ఆ స్థాయిలోనే హీరోల మార్కెట్ ను డిసైడ్ చేసేవారు.
అత్యదిక వసూళ్లు
ఇక ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మార్కెట్ కూడా చాలా రకాలుగా పెరిగిపోవడంతో హీరోల రెమ్యునరేషన్ తోపాటు మార్కెట్ కూడా అంతకు పెరుగుతూనే ఉంది. హీరో నిఖిల్ కూడా తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ హీరో కెరీర్లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాలలో కార్తికేయ ఒకటి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో పెట్టిన పెట్టుబడి భారీ వసూళ్లను అందించింది. దీంతో అదే తరహాలో మరో సినిమా చేయాలని దర్శకుడు ఎప్పటినుంచో అనుకుంటున్నాను.
అదే హెల్ప్ అవుతోంది..
ఇక ఫైనల్ గా గత ఏడాది కార్తికేయ 2 సినిమా కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఎందుకంటే కార్తికేయ సినిమా కూడా అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అదే ఫలితం హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంకా విడుదల కాలేదు అప్పుడే భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ దారిలో కార్తికేయ 2కి భారీ లాభాలు
నాన్ థియేట్రికల్ గా బిజినెస్ రూపంలో ఈ రోజుల్లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ థియేట్రికల్ గా సినిమా కలెక్షన్స్ లో అందుకోకపోయినప్పటికీ శాటిలైట్ డిజిటల్ రూపంలో మాత్రం భారీ స్థాయిలో లాభాలను ఎందుకుంటున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. కార్తికేయ 2 సినిమా కూడా శాటిలైట్ పోటీ డిజిటల్ రూపంలో దాదాపు 20 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
బడ్జెట్.. మార్కెట్ వాల్యూ ఎంతంటే
ఒక బడా సంస్థ ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను ఒక మంచి రేటు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కార్తికేయ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు చందు మొండేటి మొదటి సినిమా కంటే కూడా ఈ సినిమాను కాస్త భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. సినిమాకు పెట్టిన బడ్జెట్ తో 15 కోట్లకు దగ్గరగా ఉంటుందని సమాచారం. కానీ సినిమా మార్కెట్ వాల్యూ 20 కోట్లను దాటేసింది.
అయితే అది కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే.సినిమా విడుదల తర్వాత చిత్ర నిర్మాతలకు వచ్చేది అంతా మరొక లాభం అని చెప్పవచ్చు. సినిమాను సొంతంగానే రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిఖీల్ కార్తికేయ 2 సినిమాతో ఏ స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకుంటాడు చూడాలి.