twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ సురవరం కలెక్షన్ రిపోర్ట్.. బ్రేక్ ఈవెన్‌కి చేరాలంటే!

    |

    నిఖిల్ సిద్ధార్థ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. 'ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకొని రన్ అవుతోంది.

    వరల్డ్ వైడ్‌గా చూస్తే 3వ రోజు

    వరల్డ్ వైడ్‌గా చూస్తే 3వ రోజు

    తొలిరోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అదే జోష్ కొనసాగిస్తూ మూడో రోజు వరకూ కొనసాగింది. మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 1.15 కోట్ల రేంజ్‌లో షేర్‌ని అందుకుంది 'అర్జున్ సురవరం'. వరల్డ్ వైడ్‌గా చూస్తే 3వ రోజు 1.26 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా.

     తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజు షేర్

    తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజు షేర్

    రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు ఈ సినిమా రాబట్టిన షేర్ చూస్తే.. నైజాం 29 లక్షలు, సీడెడ్ 14 లక్షలు, ఉత్తరాంధ్ర 18 లక్షలు, ఈస్ట్ గోదావరి 11 లక్షలు, వెస్ట్ గోదావరి 9 లక్షలు, గుంటూరు 12 లక్షలు, కృష్ణా 14 లక్షలు, నెల్లూరు 8 లక్షలు మొత్తంగా ఏపీ, తెలంగాణా కలిపి 1.15 కోట్లు రాబట్టింది అర్జున్ సురవరం.

    3 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే..

    3 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే..

    నైజాం 85 లక్షలు, సీడెడ్ 43 లక్షలు, ఉత్తరాంధ్ర 52 లక్షలు, ఈస్ట్ గోదావరి 33 లక్షలు, వెస్ట్ గోదావరి 27 లక్షలు, గుంటూరు 50 లక్షలు, కృష్ణా 36 లక్షలు, నెల్లూరు 23 లక్షలు మొత్తంగా ఏపీ, తెలంగాణా కలిపి 3.49 కోట్లు రాబట్టింది అర్జున్ సురవరం. కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మరో 22 లక్షలు, ఓవర్సీస్ లో 48 లక్షలు, మొత్తంగా వరల్డ్ వైడ్ చూస్తే.. 4.19 కోట్ల షేర్ వసూలైంది. 7.55 కోట్ల గ్రాస్ నమోదైంది.

    Recommended Video

    #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
    బ్రేక్ ఈవెన్ రీచ్ కావాలంటే..

    బ్రేక్ ఈవెన్ రీచ్ కావాలంటే..

    విడుదలకు ముందు ఈ సినిమా హక్కులు 8.2 కోట్లకు అమ్ముడయ్యాయి. సో 9 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన సినిమా మరో 4.81 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లే. చూడాలి మరి ఆ ఫీట్ ఇంకెన్ని రోజుల్లో అధిగమిస్తుందో!. మొత్తానికైతే కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది అర్జున్ సురవరం.

    English summary
    Tollywood Young Hero Nikhil Siddharth new movie Arjun Suravaram. This movie released and successfully completed 3 days. This report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X