Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అర్జున్ సురవరం కలెక్షన్ రిపోర్ట్.. బ్రేక్ ఈవెన్‌కి చేరాలంటే!
నిఖిల్ సిద్ధార్థ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. 'ఠాగూర్' మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకొని రన్ అవుతోంది.
వరల్డ్ వైడ్‌గా చూస్తే 3వ రోజు
తొలిరోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అదే జోష్ కొనసాగిస్తూ మూడో రోజు వరకూ కొనసాగింది. మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 1.15 కోట్ల రేంజ్లో షేర్ని అందుకుంది 'అర్జున్ సురవరం'. వరల్డ్ వైడ్‌గా చూస్తే 3వ రోజు 1.26 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా.
తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజు షేర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు ఈ సినిమా రాబట్టిన షేర్ చూస్తే.. నైజాం 29 లక్షలు, సీడెడ్ 14 లక్షలు, ఉత్తరాంధ్ర 18 లక్షలు, ఈస్ట్ గోదావరి 11 లక్షలు, వెస్ట్ గోదావరి 9 లక్షలు, గుంటూరు 12 లక్షలు, కృష్ణా 14 లక్షలు, నెల్లూరు 8 లక్షలు మొత్తంగా ఏపీ, తెలంగాణా కలిపి 1.15 కోట్లు రాబట్టింది అర్జున్ సురవరం.
3 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే..
నైజాం 85 లక్షలు, సీడెడ్ 43 లక్షలు, ఉత్తరాంధ్ర 52 లక్షలు, ఈస్ట్ గోదావరి 33 లక్షలు, వెస్ట్ గోదావరి 27 లక్షలు, గుంటూరు 50 లక్షలు, కృష్ణా 36 లక్షలు, నెల్లూరు 23 లక్షలు మొత్తంగా ఏపీ, తెలంగాణా కలిపి 3.49 కోట్లు రాబట్టింది అర్జున్ సురవరం. కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మరో 22 లక్షలు, ఓవర్సీస్ లో 48 లక్షలు, మొత్తంగా వరల్డ్ వైడ్ చూస్తే.. 4.19 కోట్ల షేర్ వసూలైంది. 7.55 కోట్ల గ్రాస్ నమోదైంది.
Recommended Video
బ్రేక్ ఈవెన్ రీచ్ కావాలంటే..
విడుదలకు ముందు ఈ సినిమా హక్కులు 8.2 కోట్లకు అమ్ముడయ్యాయి. సో 9 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన సినిమా మరో 4.81 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లే. చూడాలి మరి ఆ ఫీట్ ఇంకెన్ని రోజుల్లో అధిగమిస్తుందో!. మొత్తానికైతే కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది అర్జున్ సురవరం.