Krthikeya 2 10 Days Collections: తగ్గిన కార్తికేయ 2 కలెక్షన్లు.. బాలీవుడ్‌లో వసూళ్లు ఎలా ఉన్నాయంటే
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది కార్తికేయ 2. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బాలీవుడ్ సినిమాలను సైతం పక్కనపెట్టి కార్తికేయ 2కు పట్టం కడుతున్నారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ 10 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దామా!
మరోసారి చందు మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. మంచి విజయం సాధించిన బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్‌కు ఒక నిర్మాత అయిన అభిషేక్ అగర్వాల్‌తోపాటు టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషించారు.

కార్తికేయ 2 బిజినెస్ వివరాలు
నిఖిల్ చిన్న హీరో అయిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సుమారు 10 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్న నిఖిల్ కార్తికేయ 2 మూవీకి మంచి బిజినెస్ జరిగింది. కార్తికేయ 2 నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6 కోట్లు, తెలంగాణలో రూ. 11.30 కోట్ల బిజినెస్ కాగా, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోటితో కలిపి మొత్తం రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను సాధించింది.

పదో రోజు వచ్చిన కలెక్షన్లు..
తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 సినిమా పదో రోజు కలెక్షన్లు కొద్దిగా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నైజాంలో రూ. 49 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.15 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అయితే తొమ్మిదో రోజు ఆదివారంతో పోలిస్తే పదో రోజైన సోమవారం కలెక్షన్లు కాస్తా తగ్గినట్లుగా తెలుస్తోంది.

10 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?
నిఖిల్ మరోసారి కార్తికేయగా నటించిన ఈ చిత్రం 10 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. నైజాంలో రూ. 9.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 2.06 కోట్లు, కృష్ణాలో రూ. 1.72 కోట్లు, నెల్లూరులో రూ. 75 లక్షలతో.. రూ. 24.08 కోట్లు షేర్, రూ. 39.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్‌వైడ్‌గా వసూళ్లు ఇలా..
హిట్ కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. 38.73 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.40 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 8.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.73 కోట్లు షేర్, రూ. 74.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్‌కు వచ్చిన లాభం ఎంతంటే?
నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు మించి వరల్డ్ వైడ్‌గా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 36.73 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 25.43 కోట్ల లాభం వచ్చింది.


Click it and Unblock the Notifications











