twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krthikeya 2 11 Days Collections: 11వ రోజు పరిగెత్తిన కార్తికేయ 2 కలెక్షన్లు!.. ఎలా ఉన్నాయంటే?

    |

    టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్​ సిద్ధార్థ్​, బ్యూటిఫుల్​ అనుపమ పరమేశ్వరన్​ జోడిగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో 2014లో నిఖిల్​ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 వస్తుందనగానే కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది కార్తికేయ 2. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అమీర్​ ఖాన్​, అక్షయ్ కుమార్​ వంటి బాలీవుడ్ హీరోల సినిమాలను సైతం పక్కనపెట్టి కార్తికేయ 2కు పట్టం కడుతున్నారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ 11 రోజుల కలెక్షన్స్​ ఎలా ఉన్నాయో చూద్దామా!

    దర్శకుడు చందు మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్​ కాంబినేషన్​లో రెండోసారి తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. ఈ సినిమాను బాలీవుడ్​లో హిట్​ కొట్టిన ది కశ్మీర్ ఫైల్స్​ మూవీకి ఒక నిర్మాత అయిన అభిషేక్​ అగర్వాల్​తోపాటు టీజీ విశ్వ ప్రసాద్​ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్​ ప్రముఖ నటుడు అనుపమ్​ ఖేర్​ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

    కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

    కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

    సుమారు 10 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్న యంగ్​ హీరో నిఖిల్​ కార్తికేయ 2 మూవీకి మంచి బిజినెస్​ జరిగింది. కార్తికేయ 2 నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్​లో రూ. 1.80 కోట్లు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​లో రూ. 6 కోట్లు, తెలంగాణలో రూ. 11.30 కోట్ల బిజినెస్​ కాగా, రెస్టాఫ్​ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్​లో రూ. 1 కోటితో కలిపి మొత్తం రూ. 12.80 కోట్ల బిజినెస్​ను సాధించింది.

    11వ రోజు వచ్చిన కలెక్షన్లు..

    11వ రోజు వచ్చిన కలెక్షన్లు..

    తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 సినిమా 11వ రోజు అక్కడక్కడ తగ్గినా, కొన్ని చోట్ల మాత్రం పెరుగుతున్న కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సినిమా నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.07 కోట్లు షేర్, రూ. 2 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అయితే తొమ్మిదో రోజు ఆదివారంతో పోలిస్తే పదో రోజైన సోమవారం కలెక్షన్లు కాస్తా తగ్గినట్లుగా తెలుస్తోంది.

    11 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

    11 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

    నిఖిల్ మరోసారి కార్తికేయగా నటించిన ఈ చిత్రం 11 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. నైజాంలో రూ. 9.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, గుంటూరులో రూ. 2.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.79 కోట్లు, నెల్లూరులో రూ. 80 లక్షలతో.. రూ. 25.15 కోట్లు షేర్, రూ. 41.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

    వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..


    అనుపమ, నిఖిల్​ జోడి కట్టిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 25.15 కోట్ల షేర్ కలెక్ట్​ చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.60 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 8.70 కోట్లు వసూలు చేసింది. వీటన్నింటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.55 కోట్లు షేర్‌, రూ. 78.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

    టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

    టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

    నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు మించి వరల్డ్​ వైడ్​గా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో కార్తికేయ 2 చిత్రానికి రూ. 40.55 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 27.25 కోట్ల లాభం వచ్చింది.

    English summary
    Nikhil Siddharth And Director Chandoo Mondeti Combo Movie Karthikeya 2. This Movie Released On August 13 And Getting Huge Responsee. Karthikeya 2 Movie Collect Rs 40.55 Cr In 11 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X