For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 12 Days Collections: కార్తికేయకు బిగ్ షాక్.. భారీగా పడిన వసూళ్లు.. మరో కోటిన్నర వస్తే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. హిట్లు ఫ్లాపులను ఏమాత్రం బేరీజు వేసుకోవడం లేదు. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

    కార్తికేయగా వచ్చేసిన నిఖిల్ సిద్దార్థ్

    కార్తికేయగా వచ్చేసిన నిఖిల్ సిద్దార్థ్

    నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజైంది.

    అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


    నిఖిల్ మార్కెట్‌, అంచనాల ప్రకారం 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    'కార్తికేయ 2' సినిమాకు 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 60 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    మోనాల్ గజ్జర్ హాట్ సెల్ఫీ: అద్దంలో ఆ అందాలు కనిపించడంతో!

    12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


    12 రోజుల్లో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.35 కోట్లు, గుంటూరులో రూ. 2.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.82 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో.. రూ. 25.75 కోట్లు షేర్, రూ. 42.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


    క్రేజీ కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రూ. 25.75 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.70 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 9.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.80 కోట్లు షేర్‌, రూ. 81.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

    శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 41.80 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 28.50 కోట్ల లాభం వచ్చింది.

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు


    చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే, 12వ రోజు మాత్రం దీనికి స్పందన ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో 12వ రోజైన బుధవారం కేవలం రూ. 60 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.25 కోట్లు వచ్చాయి. ఇదే తక్కువ మొత్తం కావడం గమనార్హం.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 41.80 Cr in 12 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X