Krthikeya 2 13 Days Collections: కార్తికేయ 2పై లైగర్ ప్రభావం!.. కొద్దిమేర తగ్గిన కలెక్షన్లు..

విభిన్నమైన స్టోరీస్​ను సెలెక్ట్​ చేసుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు టాలీవుడ్​ యంగ్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ్​. చందు మొండేటి దర్శకత్వంలో 2014లో నిఖిల్​ హీరోగా వచ్చిన కార్తికేయ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 వస్తుందనగానే కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది కార్తికేయ 2. బ్యూటిఫుల్​ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్​ కథానాయికగా నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బాలీవుడ్ హీరోల సినిమాలను సైతం పక్కనపెట్టి కార్తికేయ 2కు పట్టం కడుతున్నారు. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ 13 రోజుల కలెక్షన్స్​ ఎలా ఉన్నాయో చూద్దామా!

దర్శకుడు చందు మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్​ కాంబినేషన్​లో రెండోసారి తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మాతగ వ్యవహరించారు. ఆయన బాలీవుడ్​లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి రెస్పాన్స్​ అందుకున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. కార్తికేయ 2 చిత్రానికి అభిషేక్​ అగర్వాల్​తోపాటు టీజీ విశ్వ ప్రసాద్​ మరో నిర్మాతగా వ్యవహరించారు.

కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

సినీ రంగంలో దాదాపుగా 10 ఏళ్లు నుంచి రాణిస్తున్న యంగ్​ హీరో నిఖిల్​ కార్తికేయ 2 మూవీకి బిజినెస్​ బాగానే జరిగింది. కార్తికేయ 2 నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్​లో రూ. 1.80 కోట్లు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​లో రూ. 6 కోట్లు, తెలంగాణలో రూ. 11.30 కోట్ల బిజినెస్​ కాగా, రెస్టాఫ్​ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్​లో రూ. 1 కోటితో కలిపి మొత్తం రూ. 12.80 కోట్ల బిజినెస్​ను సాధించింది.

 13వ రోజు వచ్చిన కలెక్షన్లు..

13వ రోజు వచ్చిన కలెక్షన్లు..

తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 సినిమా 13వ రోజు లైగర్​ మూవీ విడుదల కారణంగా కలెక్షన్లు కొద్దిమేర తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో.. రూ. 31 లక్షల షేర్, రూ. 0.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అయితే తొమ్మిదో రోజు ఆదివారంతో పోలిస్తే పదో రోజైన సోమవారం కలెక్షన్లు కాస్తా తగ్గినట్లుగా తెలుస్తోంది.

13 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

13 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

నిఖిల్ మరోసారి కార్తికేయగా అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్​లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 9.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.36 కోట్లు, గుంటూరులో రూ. 2.23 కోట్లు, కృష్ణాలో రూ. 1.84 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో.. రూ. 26.06 కోట్లు షేర్, రూ. 43.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

 వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్​ కీలక పాత్ర పోషించిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో రూ. 26.06 కోట్ల షేర్ కలెక్ట్​ చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. వీటన్నింటితో కలుపుకుంటే 13 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.53 కోట్లు షేర్‌, రూ. 83.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

 టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు మించి వరల్డ్​ వైడ్​గా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో కార్తికేయ 2 చిత్రానికి రూ. 42.53 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.23 కోట్ల లాభం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X