Karthikeya 2 Collections: మళ్లీ మాస్ కుమ్ముడు.. 15వ రోజు అన్ని కోట్లు.. మొత్తం ఎంతో తెలిస్తే మెంటలే

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తోన్నాడు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సినిమాలకే పరిమితం అయిన అతడు.. ఆ తర్వాత పంథాను మార్చుకుని దూసుకుపోతోన్నాడు. దీంతో ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు.

ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్లు అత్యధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 15 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

నిఖిల్ మార్కెట్‌, బజ్ నేపథ్యంలో 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

15వ రోజు 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 62 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

'కార్తికేయ 2' మూవీకి 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.89 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, గుంటూరులో రూ. 2.35 కోట్లు, కృష్ణాలో రూ. 1.92 కోట్లు, నెల్లూరులో రూ. 89 లక్షలతో.. రూ. 27.78 కోట్లు షేర్, రూ. 46.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో రూ. 27.78 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 15 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.78 కోట్లు షేర్‌, రూ. 90.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

యంగ్ హీరో నిఖిల్ - అనుపమ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 45.78 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 32.48 కోట్ల లాభం వచ్చింది.

15వ రోజూ అన్ని కోట్ల వసూళ్లతో

15వ రోజూ అన్ని కోట్ల వసూళ్లతో

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా 15వ రోజైన శనివారం ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 2 కోట్లకు పైగానే షేర్ వచ్చింది. దీంతో సినీ విశ్లేషకులే షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X